నూతన జిల్లా విద్యాశాఖాధికారి రాముకు సన్మానం
భగవద్గీత ప్రదానం చేసిన ఆర్.యు.పి.పి.టి జగిత్యాల జిల్లా శాఖ
On
కొత్త DEO రాముకు సన్మానం
భగవద్గీత ప్రదానం చేసిన ఆర్.యు.పి.పి.టి జగిత్యాల జిల్లా శాఖ
జగిత్యాల నవంబర్ 25:
జగిత్యాల జిల్లా విద్యాశాఖాధికారి గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కెలావత్ రాము నాయక్ కు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జగిత్యాల జిల్లా శాఖ పక్షాన జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ ఘనంగా శాలువాతో సత్కరించి భగవద్గీత ప్రదానం చేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి కేలావత్ రాము మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నే నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కటుకం నరేందర్, చంద సత్యనారాయణ, సంద రాజేందర్, శ్రీకాంత్, సయీద్ పాషా, శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
Tags