టీజీసీటీఏ హనుమకొండ జిల్లా అధ్యక్షులుగా ములుకనూర్ వాసి డా. సురేష్ బాబు
హనుమకొండ జిల్లా టి జి సి టి ఏ నూతన కార్యవర్గం ఎన్నిక
భీమదేవరపల్లి నవంబర్ 28 (ప్రజామంటలు) :
తెలంగాణ గవర్నమెంట్ అధ్యాపకుల సంఘం హనుమకొండ సంఘ బాధ్యుల ఎన్నికలు హనుమకొండ కాకతీయ ప్రభుత్వ కళాశాల నందు డా. పి.పల్లవి అధ్యక్షతన నిర్వహించారు.ఈ ఎన్నికలలో కాకతీయ ప్రభుత్వ కళాశాల, పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల, మరియు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, పరకాల సభ్యులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో టీజీసీటీఏ హనుమకొండ జిల్లా అధ్యక్షులుగా పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ డాక్టర్ డి సురేష్ బాబు జిల్లా అధ్యక్షులుగా, కాకతీయ గవర్నమెంట్ కళాశాల గణిత శాస్త్ర అధ్యాపకులు టి నరహరి జిల్లా కార్యదర్శిగా, పింగిళి గవర్నమెంట్ మహిళా కళాశాల డాక్టర్ బి సువర్ణ మహిళా కార్యదర్శిగా మరియు కోశాధికారిగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల పరకాల ఆర్థిక శాస్త్ర అధ్యాపకులు ఎం .సమ్మయ్య ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన డాక్టర్ బి సురేష్ బాబు మాట్లాడుతూ, ఉన్నత విద్య అభివృద్ధికి, సభ్యుల సర్వీస్ పరమైన సమస్యల పరిష్కారానికి మరియు ప్రభుత్వానికి సభ్యులకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారని తెలిపారు. హనుమకొండ జిల్లా ఎన్నికలకు ఎన్నికల అధికారులుగా డాక్టర్ డి వెంకన్న మరియు డాక్టర్ బి రమేష్ వ్యవహరించారు. ఎన్నికల అనంతరం కాకతీయ ప్రభుత్వ కళాశాల ప్రధాన ఆచార్యులు ప్రొఫెసర్ డాక్టర్ రాజా రెడ్డి మాట్లాడుతూ నూతన కార్యవర్గం మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.ఈ ఎన్నికల కార్యక్రమంలో రాష్ట్ర అకాడమిక్ సెక్రటరీ డాక్టర్ ఏ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ సెక్రటరీ డాక్టర్ విజయపాల్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జరుపుల రమేష్, కాకతీయ యూనివర్సిటీ సెక్రెటరీ డాక్టర్ ఆడెపు రమేష్, పూర్వ రాష్ట్ర బాధ్యులు డాక్టర్ కిషోర్, డాక్టర్ కొలిపాక శ్రీనివాస్, డాక్టర్ రాజయ్య, డాక్టర్ బి యుగంధర్, డాక్టర్ శశికాంత్,డాక్టర్ డి. సమ్మయ్య, డాక్టర్ జి మహేందర్, డాక్టర్ పావని, డాక్టర్ సీతారాం, డాక్టర్ వి ఎస్ ఉమాదేవి, డాక్టర్ వీరన్న, డాక్టర్ మాలోతు ఘన్ సింగ్ మరియు ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు.