చేతివ్రాత తో విద్యార్థి యొక్క వ్యక్తిత్వం తెలుసుకునే అవకాశం ఉంటుంది. - ప్రిన్సిపల్ అనగల్ల రాజేంధర్

On
చేతివ్రాత తో విద్యార్థి యొక్క వ్యక్తిత్వం తెలుసుకునే అవకాశం ఉంటుంది. - ప్రిన్సిపల్ అనగల్ల రాజేంధర్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9973349493/9348422113). 

జగిత్యాల డిసెంబర్ 19 ( ప్రజా మంటలు) : 

జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆఫ్ ఎక్సలెన్సీ హైస్కూల్లో గత పది రోజుల నుండి 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు చేతివ్రాత ప్రత్యేక శిక్షణ నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అనగల్ల రాజేంధర్ మాట్లాడుతూ:

  • చేతివ్రాత సక్రమంగా లేని విద్యార్థులకు మెలకువలతో కూడిన శిక్షణ ఇస్తూ ఉండటంతో చేతివ్రాతలో మార్పు వస్తుందన్నారు.
  • చదువుతోపాటు అందమైన రాత విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చేతిరాత అందంగా ఉంటే వారి వ్యక్తిత్వం కూడా తెలుసుకునే ఆవకాశం ఉంటుందని తెలిపారు.
  • అందమైన రాత మన తలరాతలను మారుస్తుందని చేతిరాత ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రిన్సిపల్ అన్నారు..

ఆనంతరం ప్రముఖ చేతివ్రాత శిక్షకుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ.... 

  • చేతివ్రాతను అందంగా తీర్చిదిద్దడానికి శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపాడు.
  • ఓవెల్ ,స్ట్రోక్ ,స్లాంట్ తదితరాంశాలపై 10 రోజుల నుండి శిక్షణ ఇస్తూ ప్రతిఅక్షరంపై విద్యార్థులకు అవగాహన కల్పించాము అన్నాడు.
  • రోజుకు గంట సమయం కేటాయించి అక్షరాలు,పదాలు ,వ్యాఖ్యలు వ్యాసాలు అందంగా రాయడం నేర్పించామని తద్వారా పిల్లలకు అందంగా చేతివ్రాత అలవాడిందని విద్యార్థులు చక్కగా చేతిరాత నేర్చుకున్నారని ఆనందం వ్యక్తం చేశాడు.

ఆనంతరం శిక్షణ పొందిన విద్యార్థులు మాట్లాడుతూ.....

  • ఇలాంటి అందమైన చేతివ్రాత శిక్షణ ద్వారా మా చేతివ్రాత ఎంతో మారిందని ఈ వ్రాత మాకు అందమైన భవిష్యత్తును ఇస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.

ఆనంతరం చేతివ్రాతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అనగల్ల రాజేంధర్,ఉపాధ్యాయులు, సబ్ ట్రేనర్ అజయ్ పాల్గొన్నారు.

Tags