డ్యూటీ ఫ్రీ మద్యం ముసుగులో లిక్కర్ వ్యాపారం.పట్టుబడ్డ కానిస్టేబుల్, హోంగార్డ్.- రూ. 15 లక్షలు మద్యం పట్టివేత
డ్యూటీ ఫ్రీ మద్యం ముసుగులో లిక్కర్ వ్యాపారం.పట్టుబడ్డ కానిస్టేబుల్, హోంగార్డ్.- రూ. 15 లక్షలు మద్యం పట్టివేత
• మూడు కార్ల స్వాధీనం..• అయిదుగురుపై కేసు నమోదు
హైదారాబాద్ డిసెంబర్ 27:
శంషాబాద్ ఎయిర్పోర్టులో పనిచేస్తున్న కానిస్టేబుల్, హోంగార్డులు కలిసి డ్యూటీ ఫ్రీ లిక్కర్ అమ్ముతున్నట్లు తెలిసి, ఎక్సైజ్ బృందం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఒక కానిస్టేబుల్, హోం గార్డు, మర్లo ముగ్గురిని అరెస్ట్ చేశారు.
నూతన సంవత్సరం వేడుకల కోసం భారీగా కొనుగోలు చేసిన రూ. 15 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
వీఐపీలు వచ్చినప్పుడు ప్రోటోకాల్ లో భాగంగా విధులు నిర్వహించినటువంటి ఈ కానిస్టేబుల్, హోంగార్డు మరి కొంతమంది కలిసి ఎయిర్పోర్టులో ఉండే డ్యూటీ ఫ్రీ లిక్కర్ దుకాణాల నుంచి మద్యాన్ని పలువురు ప్యాసింజర్ల పేరుతో కొనుగోలు చేసేవారని, ఈ డ్యూటీ ఫ్రీ మద్యం బాటిలను అమ్మకాలు చేపడుతూ లాభాలను ఆర్జిస్తున్నారు.
ఈ విషయాన్ని పసిగట్టినటువంటి ఎక్సైజ్ డిటిఎఫ్ పోలీసులు డ్యూటీ ఫ్రీ మద్యం అమ్మకాలు జరుపుతుండగా మూడు కార్లను, వాటిలో లభించిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పట్టుకున్న మద్యం విలువ రూ. 15 లక్షలు ఉంటుందని శంషాబాద్ ఎక్సైజ్ సూపర్డెంట్ కృష్ణప్రియ తెలిపారు.ఇలా చేయడం వల్ల ఎక్సైజ్ ఆదాయానికి చాలా గండి పడుతుందని సమాచారం మేరకు ఈ మద్యం బాటీలను పట్టుకున్నట్లు తెలిపారు.
నిందితులు కానిస్టేబుల్ ఎం.జమ్య నాయక్, సాఫ్టువేర్ ఇంజనీర్ గీదర హరీష్ కుమార్ రెడ్డి , ఆర్ట్ బోటిక్ హోటల్‌లో మేనేజర్ పొట్లూరి రాఘవేంద్రరావు,హోం గార్డ్ బండారి లింగయ్య, హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ షాప్‌లోని బిల్లింగ్ కౌంటర్‌లో పనిచేస్తున్నా మహేశ్వర్ (పరారీలో ఉన్నారు)