బీసీల రిజర్వేషన్లు పెంచకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వం - ఎమ్మెల్సీ కవిత*
On
బీసీల రిజర్వేషన్లు పెంచకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వం - ఎమ్మెల్సీ కవిత*
హైదరాబాద్ డిసెంబర్ 27:
జనాభాలో సగానికిపైగా బీసీలు ఉన్నారని, వారికి కాంగ్రెస్ పార్టీ కామరెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టు రిజర్వేషన్లు పెంచాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.ఈరోజు తన ఇంట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
జనాభా అనుగుణంగా రిజర్వేషన్లు పెంచకుండా, 42 శాతం అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదనని, కనీసం ఆ 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారనే అనుమానాలు కలుగుతున్నాయని ఆమె అన్నారు
రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనివ్వమని, ప్రజలందరినీ కలుపుకొని, మండల కేంద్రాల్లో, జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు
Tags