శ్యామ్ బెనగల్‌కు సీఎం రేవంత్, సినీ ప్రముఖుల  నివాళులు 

On
శ్యామ్ బెనగల్‌కు సీఎం రేవంత్, సినీ ప్రముఖుల  నివాళులు 

శ్యామ్ బెనగల్‌కు సీఎం రేవంత్, సినీ ప్రముఖుల  నివాళులు 

హైదారాబాద్ / ముంబయి డిసెంబర్ 23:

ప్రముఖ దర్శకుడు, నిర్మాత, రచయిత, పద్మభూషణ్ శ్యామ్ బెనగల్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. చలన చిత్ర రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన శ్యామ్ బెనగల్ మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు. శ్యామ్ బెనగల్ కు హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ఇక్కడే జన్మించి ఇక్కడే విద్యాభ్యాసం చేసిన శ్యామ్ బెనగల్ గారు సినీరంగంలో ఏడుసార్లు జాతీయ స్థాయి అవార్డులతో పాటు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకుని అత్యున్నత స్థాయికి ఎదిగారని అన్నారు. అంకుర్, నిషాంత్, మంథన్, భూమిక వంటి మేటి చిత్రాలు రూపొందించి సినీ రంగంలోనే గొప్ప మార్పులు తెచ్చారని కొనియాడారు. శ్యామ్ బెనగల్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

హిందు చిత్ర నిర్మాతలు శేఖర్ కపూర్, హన్సల్ మెహతా, మరియు సినీ నటులు మనోజ్ బాజ్‌పేయి, అక్షయ్ కుమార్ మరియు కాజోల్ శ్యామ్ బెనగల్‌కు నివాళులర్పించారు, ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్‌ను తన చిత్రాలతో పునర్నిర్వచించిన మరియు తరతరాలకు స్ఫూర్తినిచ్చిన మాస్టర్ కథకుడిగా పేర్కొన్నారు. 2001లో "జుబేదా"లో దర్శకుడితో కలిసి పనిచేసిన బాజ్‌పేయి, బెనెగల్ మరణం భారతీయ సినిమాకి "హృదయ విదారకమైన లోటు" అన్నారు. శ్యామ్ బెనెగల్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు, ప్రముఖ చిత్రనిర్మాత కథలు భారతీయ సినిమాపై తీవ్ర ప్రభావం చూపాయని అన్నారు.

Tags