యూరోకిడ్స్ దాన్ ఉత్సవ్–2024 *అనాధాశ్రమాలకు డేలీ నీడ్స్ అందజేత
On
యూరోకిడ్స్ దాన్ ఉత్సవ్–2024
*అనాధాశ్రమాలకు డేలీ నీడ్స్ అందజేత
సికింద్రాబాద్ డిసెంబర్ 21 (ప్రజామంటలు):
దాన్ ఉత్సవ్–2024 లో భాగంగా పద్మారావునగర్ యూరోకిడ్స్ స్కూల్ నిర్వాహకులు విద్యార్థుల పేరేంట్స్ నుంచి నిత్యవసరాల వస్తువులను కలెక్ట్ చేసి శనివారం పలు అనాధాశ్రమాలకు వితరణ చేశారు. న్యూ బోయిగూడలోని లిటిల్ సిస్టర్స్ హోమ్ ఫర్ ఏజ్డ్, సీతాఫల్మండి లోని అమన్ వేధిక రేయిన్బో హోమ్ ఫర్ ఆర్పన్ గర్ల్స్ , సిటీ లైట్ హోటల్ దగ్గరున్న అర్పనెజ్ నైటింగల్ హోమ్ ఫర్ బాయ్స్ లో స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్తార్ విద్యావతి కలెక్ట్ చేసిన వస్తువులను అందచేశారు. ఈసందర్బంగా ఆయా ఆర్గనైజేషన్ లోని చిన్నారులు, వృద్దులు, మహిళలు తమకు నిత్యవసరాల వస్తువులను ఇచ్చిన దాతలకు కృతజ్ఞతలు చెప్పారు.
Tags