ఆటవీ అధికారుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మొజం అలీ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక 

On
ఆటవీ అధికారుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మొజం అలీ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక 

ఆటవీ అధికారుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మొజం అలీ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక 

న్యూ ఢిల్లీ డిసెంబర్ 23:

అఖిల భారత అటవీ అధికారుల సమాఖ్య జాతీయ సమావేశం నిన్న ఆదివారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.

న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా  తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ రేంజ్ అధికారి ఎం.డీ. మోజామ్ అలీ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన  పవన్ కుమార్ ( ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గజ్వేల్) దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

ఆజం హుస్సేన్ (మెదక్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్) ఆలిండియా జాయింట్ సెక్రటరీగా, జాకీర్ ( డిప్యూటీ రేంజి ఆఫీసర్ మహబూబ్ నగర్) ఆలిండియా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎన్నికయ్యారు.

Tags