జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. 

On
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. 

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/93484221133).

మల్లాపూర్ నవంబర్ 28 (ప్రజా మంటలు) :

గురువారం రోజున మల్లాపూర్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను, వంటశాలను, స్టోర్ రూంను తనిఖీ చేశారు. ఫుడ్ ప్రొవిజన్స్ ని పరిశీలించారు. నాణ్యమైన భోజనం, పరిసరాల పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం గురించి తగు సలహాలు సూచనలు సూచించారు.

భోజనం రోజూ వారి మెను ప్రకారం అందించాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణం మెయిన్ గేట్ కోసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ల గా కలెక్టర్ వెంటనే కావలిసిన ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని ఆర్డిఓ కు ఆదేశించారు.

పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, టాయిలెట్లను శానిటేషన్ చేయించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని,విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు పాఠశాల నిర్వహణలో కాని , భోజన ఏర్పాట్లలో కాని ఎలాంటి నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కలెక్టర్ వెంట, మెట్పల్లిఆర్డీవో శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి డిఇఓ, రామ్, ఎమ్మార్వో,సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Tags