సదర్ మట్ ప్రాజెక్టు భూ సేకరణ - అవగహన సదస్సు
On
సదర్ మట్ ప్రాజెక్టు భూ సేకరణ - అవగహన సదస్సు
ఇబ్రహీంపట్నం నవంబర్ 26 (ప్రజా మంటలు):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కోమటి కొండాపూర్ మరియు మూల రాంపూర్ గ్రామాలలో గ్రామ సభ రెవెన్యూ ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యములో ఆర్డీవో సమక్షంలో సదర్ మార్ట్ ప్రాజెక్టుకు భూ సేకరణ గురించి 11 గంటలకు కోమటి కొండాపూర్ గ్రామము 40 మంది రైతులు మరియు 2 గంటలకు మూల రాంపూర్ గ్రామాలలోని 21 మంది రైతులతో సమావేశం నిర్వహించారు.
కోమటి కొండాపూర్ 36.39,
మూల రాంపూర్ 16.04 ,
భూ సేకరణలో ప్రాథమిక తెలంగాణ రాజ పత్రం ద్వారా ప్రచురించ నైనది, ఏమైనా అభ్యంతరాలు ఉంటే 60 రోజుల లోపు ఆర్డీవో కార్యాలయం లో వ్రాత పూర్వకముగా గ్రామ సభ ద్వారా తెలుపవచ్చు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, తహసిల్దార్, ఎంపీడీవో, డి ఈ నిర్మల్, మార్కెట్ కమిటీ చైర్మన్, పంచాయతీ సెక్రటరీ, కారోబార్ పాల్గొన్నారు,
Tags