భీమ్ రాజ్ పల్లిలో ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం 

On
భీమ్ రాజ్ పల్లిలో ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం 

భీమ్ రాజ్ పల్లిలో ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం 

గొల్లపల్లి డిసెంబర్ 26 (ప్రజా మంటలు):

 మండలంలోని భీమ్ రాజ్ పల్లి లోబొమ్మెన కుమార్, నరేందర్, ముక్తామణి గురు స్వాము ల స్వగృహంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంఅత్యంత వైభవంగా జరిగాయి గురుస్వాములు బ్రహ్మశ్రీ నాగుల మల్యాల వీరాచారి, కట్టసత్యనారాయణ  చారి,గందె వేణు,గంధం పరంధాములు ఆధ్వర్యంలో శ్రీ గణపతి,సుబ్రహ్మణ్యస్వామి, గౌరీ దేవి, శ్రీ చక్ర అర్చన, శ్రీ అయ్యప్ప స్వామి అభిషేకం, మెట్ల పూజ, జ్యోతి ప్రజ్వలన, కుంకుమార్చన పూజలు  నిర్వహించారు.జగిత్యాలశేషు గురుస్వామి ఆర్కెస్ట్రా విభావరి, శ్రీ అయ్యప్ప స్వామి పేట తుల్లి ఆటలు,స్వాముల భజనలు నృత్యాలు, పాటలతో, అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమొగాయి అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవానికి, పెద్దపల్లి, జగిత్యాల, వేములవాడ జిల్లాకు చెందిన స్వాములుపెద్ద ఎత్తున తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప భక్తి గీతాలు ఆలపించారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కందుకూరి కృష్ణారెడ్డి,గాన గంధర్వులు కిష్టంపేట రమేష్ రెడ్డి, గురుస్వాములు చొక్కా రెడ్డి, బొమ్మ రాజేశం,వడ్లకొండ శివ కుమార్, విజ్జతుల మహేష్, అంజయ్య. భీమ్ రాజు పల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags