నా వంతు క్రీడా రంగానికి సహాయ సహకారాలు అందిస్తా. - జిల్లా విద్యాశాఖ అధికారి రాము.

On
నా వంతు క్రీడా రంగానికి సహాయ సహకారాలు అందిస్తా. - జిల్లా విద్యాశాఖ అధికారి రాము.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు) : 

జిల్లా కేంద్రంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా విద్యాశాఖ అధికారి రాము ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రాము మాట్లాడుతూ..... జిల్లాలో నా వంతు క్రీడా రంగానికి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. 

అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల నుండి క్రీడాకారులను తయారుచేసి జిల్లా ప్రతిష్ట పెంచాలని క్రీడల వలన స్నేహభావం పెరిగి మానసిక ఒత్తిడి విద్యార్థులకు తగ్గుతుందని మరియు క్రీడారంగం పట్ల ప్రతి విద్యార్థి దృష్టి సారించేలా వ్యాయామ ఉపాధ్యాయులు జిల్లాలోని వివిధ అసోసియేషన్ సంఘ సభ్యులు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జి రామదాస్. ఈ అంజయ్య కోశాధికారి బి కొమురయ్య సంఘ సభ్యులు కలిసి జిల్లా విద్యాశాఖ అధికారిని సన్మానం చేసినారు

Tags