శ్రవణానందాన్ని అందించిన గాత్ర కచేరి

వైభవంగా గోదావరి హారతి

On
శ్రవణానందాన్ని అందించిన గాత్ర కచేరి

IMG-20241126-WA0557
(రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి నవంబర్ 26:
కార్తీక మాసం సందర్భంగా, ధర్మపురి దేవస్థానంలో అనునిత్యం 
 నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మంగళ వారం రాత్రి దేవస్థానం ఆధ్వర్యంలో శేషప్ప కళావేదికపై 
నిర్వహించిన సంగీత రత్న బ్రహ్మశ్రీ కొరిడే నరహరి శర్మ కర్నాటక శాస్త్రీయ సంగీత కచేరి ఆబాల గోపాలాన్నీ ఆనంద
పరవశుల గావించింది. తెలంగాణ త్యాగయ్యగా వినుతి కెక్కిన దివంగత
సంగీత విద్వాంసులు చాచం కృష్ణయ్య ప్రియ శిష్యులు, బహుముఖ ప్రజ్ఞా 
శాలి సంగీత రత్న కొరిడె నరహరి శర్మ నోట అలవోకగా జాలువారిన
సంగీత ఝరి రసజ్ఞులైన శ్రోతల హృదయాంతరాళను పునీతం చేసి, అలౌ
కిక ఆనందంలో ముంచి వేసింది. రెండు గంటలకు పైగా సాగిన సాంప్ర
దాయ సంగీత కార్యక్రమం స్థానికులతో పాటు, దూరప్రాంత భక్తులను,
యాత్రికులను మంత్ర ముగ్ధులను గావించింది. వేముల వాడ దేవస్థాన
ఆస్థాన విద్వాంసులు రామయ్యశర్మ కీబోర్డు, మంథని సంగీత కళాశాల
ఆచార్యులు రాజేశం తబలా ఇంపైన వాద్య సహకారాన్ని అందించి ప్రశం
సలనందు కున్నారు. దేవస్థానం పక్షాన కళాకారులను ఘనంగా సన్మానించి ప్రశంసల జల్లు కురిపించారు.

వైభవంగా గోదావరి హారతి

కార్తీకమాసం సందర్భంగా గోదావరి హారతి లొ బాగంగా  25 వ రోజు  స్థానిక శారదా మహిళా మండలి సభ్యులు , వాసవి మహిళా మండలి సభ్యులు, తిరుమల సేవా గ్రూప్ కరీంనగర్ సభ్యులు దేవస్థానం అర్చకులు సిబ్బంది భక్తులు శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం నుండి మేళ తాళాలతో  , హరినామ సంకీర్తనలతో గోదావరి నదివరకు వెళ్ళి, విశేష పూజల అనంతరం గోదావరి నదిలొ దీపాలు సమర్పించారు.  దేవస్థానం  సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ , వేదపండితులు  బొజ్జ రమేష్ శర్మ ,   పాలెపు ప్రవీణ్ కుమార్ , ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్ , అర్చకులు, సిబ్బంది   మహిళలు పాల్గొన్నారు .

Tags