అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి పుటోకో పార్టీ మారినట్టు కాదు!
విద్యార్థి దశ నుండి మంత్రిదాకా అధికారం ఉన్నా లేకున్నా ఒకే పార్టీలో ఉన్న వ్యక్తి పొన్నం ప్రభాకర్ గౌడ్
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంబాల శ్రీకాంత్
ఎల్కతుర్తి, డిసెంబర్ 20 (ప్రజామంటలు) :
మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ మాట్లాడుతూ అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసము పూటకో పార్టీ మారే వ్యక్తి గంగుల కమలాకర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ ను విమర్శించే అంత స్థాయి కాదని అన్నారు. విద్యార్థి నాయకునిగా మొదలైనటువంటి రాజకీయ ప్రస్తావన ఓ పార్టీని నమ్ముకుని అంచలంచెలుగా ఎదుగుతూ కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో పార్లమెంట్ సభ్యుడుగా గెలుపొందారు అని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అధికారం పార్టీలో ఉన్నా కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సైతం లెక్కచేయకుండా ఆంధ్ర పెత్తందారుల చేతిలో పార్లమెంట్ లో పెప్పర్స్ పే దాడులకు గురై ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ వచ్చుడో చచ్చుడో అనే నినాదంతో పార్లమెంట్లో గళం విప్పి అధిష్టానొప్పించి స్వరాష్ట్ర తెలంగాణ రావడంలో కృషి చేసిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ గౌడ్ అని అన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్ హుస్నాబాద్ ప్రజల కోరిక మేరకు హుస్నాబాద్ నియోజకవర్గ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి 19000 ఓట్ల మెజార్టీతో గెలుపొంది నేడు హుస్నాబాద్ ప్రజలు ఆశీర్వదించి మంత్రి చేశారని రాష్ట్రంలోనే హుస్నాబాద్ సస్యశ్యామలం చేయడం కోసం కంకణం కట్టుకున్నారని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ పనులను సంవత్సర కాలంలోనే నిధులు మంజూరు చేసిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ గౌడ్ అని అన్నారు. బీసీ నాయకుడు మంత్రి పదవిలో ఉండడం బి ఆర్ ఎస్ వెలమ దొరలకు ఇష్టం లేక బీసీ నాయకులతోనే విమర్శలు చేయించడం సరికాదని అభివృద్ధి లక్ష్యంగా దూసుకుపోతున్నటువంటి రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లాంటి వ్యక్తిని పట్టుకొని విమర్శించడం సరికాదని ఇంకోసారి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను విమర్శించినట్లయితే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. అక్రమంగా సంపాదించినటువంటి సొమ్మును కాపాడుకోవడం కోసం పూటకో పార్టీ మారి గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని గ్రానైట్ కోరీలలో నచ్చిన విధంగా పర్మిషన్లు తీసుకొని ప్రభుత్వానికి చెల్లించే ఆదాయాన్ని కట్టినట్టువంటి వ్యక్తి కమలాకర్ అని మరోసారి రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను విమర్శించినట్లయితే హుస్నాబాద్ ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తాయని పద్ధతి మానుకొని రాష్ట్రానికి ప్రజలు కావలసిన వాటిలో సూచనలు ఇస్తే బాగుంటుందన్నారు