ఘనంగా ధనలక్ష్మి ధన్వంతరి కళ్యాణ వేడుకలు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు) :
స్థానిక చింతకుంట చెరువు సమీపంలోని శ్రీ సూర్యనారాయణ ధనలక్ష్మి సహిత ధన్వంతరి దేవాలయంలో, ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని, ధనలక్ష్మి ధన్వంతరి కళ్యాణం వైభవంగా జరిగింది.
కళ్యాణ అనంతరం భక్తులకు నిర్వాహకులు అన్న ప్రసాదం అందించారు.
ఈనాటి కార్యక్రమంలో ఆలయ అర్చకులు చిలుక ముక్కు నాగరాజు, ఆలయ పౌండర్ డాక్టర్ v రాజన్న, ఆలయ అధ్యక్షుడు పాళ్తేపు శంకర్, డాక్టర్ ధనుంజయ, తవుటు రామచంద్రం, కరీంనగర్ వాస్తవ్యులు ప్రవీణ్ లావణ్య దంపతులు అన్నదాన కార్యక్రమంనిర్వహించారు.
కన్యాదాన దాతలుగా జమ్మికుంట వాస్తవ్యులు మనోహర్, పద్మావతి, దంపతులు వ్యవహరించారు. అలాగే రేపల్లె హరికృష్ణ, వడ్లగట్ట శంకర్, పాల్టెపు అరుణ, సత్యవతి, స్వాతి, లత, టి. శ్రీదేవి భక్తులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
అర్చకులు చిలకముక్కు నాగరాజు, సామాజిక కార్యకర్త రామచంద్రం కళ్యాణం వైసిష్ట్యాన్ని తెలియజేశారు.