పాఠశాల గ్రంథాలయాన్ని ప్రారంభించిన జిల్లా విద్యాధికారి రాము 

On
పాఠశాల గ్రంథాలయాన్ని ప్రారంభించిన జిల్లా విద్యాధికారి రాము 

పాఠశాల గ్రంథాలయాన్ని ప్రారంభించిన జిల్లా విద్యాధికారి రాము 

 ధర్మపురి డిసెంబర్ 21:

మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయాన్ని గౌరవ జిల్లా విద్యాధికారి కే. రాము  ప్రారంభించారు.

పాఠశాల ఉపాధ్యాయులు డా. గొల్లపల్లి గణేశ్  విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కి చెందిన వసంత టూల్స్ అండ్ క్రాఫ్ట్స్  రేణుక దయానంద రెడ్డి  30 వేల రూపాయల విలువ గల పుస్తకాలు మరియు ఒక బీరువాను అందించారు.IMG-20241221-WA0561 

ఈ సందర్భంగా విద్యాధికారి దాతలను అభినందిస్తూ, విద్యార్థులు ఈ పుస్తకాల ద్వారా మంచి జ్ఞానాన్ని పొందాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎస్. సీతలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెండ్యాల మహేందర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కొలిచాల శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు కాసర్ల నరసింహ మూర్తి, గొల్లపెల్లి గణేశ్, జ్యోతి, వంశి, రమేష్, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags