బీర్పూర్ లో సంచలనo సృస్టించిన దోపిడి కేసులో 6 గురు నిందితులను అరెస్ట్
బీర్పూర్ లో సంచలనo సృస్టించిన దోపిడి కేసులో 6 గురు నిందితులను అరెస్ట్
5 లక్షల విలువగల 10 తులల బంగారం, 10 వేల నగదు,రెండు బొమ్మ తుపాకీలు,6 సెల్ ఫోన్ లు స్వాదినం.
- జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్
గొల్లపల్లి డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
మున్నీసుల శ్రీనివాస్, చిప్పబత్తుల తులసయ్య , బక్కెనపల్లి అరుణ్ , యశోద శ్రీనివాస్ , సైదు సహదేవ్, రత్నం మాణిక్యం మరియు ముకునూరి కిరణ్ కుమార్ లు ఒక గ్యాంగ్ గా ఏర్పడి కొన్ని రోజుల నుండి కిరణ్ దగ్గర ఉన్న ఒక యంత్రం తో గుప్తా నిదుల కోసం వెతుకుతూ ఉండేవారు ఎక్కడ కూడా గుప్తా నిధులు దొరకకపోవడంతో వీరందరూ కలిసి ఎవరన్నా బాగా డబ్బులు ఉన్న వారి ఇంట్లో దోపిడి చేసి వచ్చిన డబ్బులతో జల్సా చేద్దామనీ ప్లాన్ వేసుకొన్నారు.
ఒకరోజు తుమ్మెనల ధగ్గర గల సహదేవ్ హోటల్లో కలిసి బీర్పూర్ లో డబ్బులు, బంగారం ఉన్న ఒక షావుకారి కాసం ఈశ్వరయ్య అతని బార్య మాత్రమే ఉంటారనీ, వారు ముసలి వాళ్ళని, వాళ్ళ ఇంట్లో చొరబడి దోపిడి చేస్తే డబ్బు, బంగారు ఆభరణాలు దొరుకుతాయని పథకం వేసుకొన్నారు.
.3 తారీఖున రాత్రి అందరూ కలిసి తుమ్మెనల ధగ్గర గల సహదేవ్ హోటల్లో కలుసుకొని. మంకీ క్యాప్ లు దరించి బొమ్మ తుపాకీలు పట్టుకొని కిరణ్ కుమార్, అరుణ్, తులసయ్య, మున్నేసుల శ్రీనివాస్ లు ఒక నెంబర్ లేని స్కూటీ, ఫ్యాషన్ ప్రో బైక్ ల మీద బీర్పూర్ కి వెళ్ళి అర్ధరాత్రి 2.30 గం. లకు కాసం ఈశ్వరయ్య ఇంటి వెనకాల నుండి గోడ దూకి బాత్రూమ్ దగ్గర జాక్కొని ఉదయం 5.00 గం.లకు ఈశ్వరయ్య బాత్రూమ్ కి వెళ్లడానికి రాగా అతనిని గట్టిగా అధిమి పట్టి బొమ్మ తుపాకితో తల మీద కొట్టి ఇంట్లోకి ఈడుచుకెళ్లి ఈశ్వరయ్య, అతని బార్యను గుడ్డ పేగులు నోట్లో కుక్కి కట్టేశారు.
వొంటి మీద ఉన్న బంగారు ఆబరణాలు, ఇంట్లో ఉన్న డబ్బులు దోపిడి చేసి అక్కడి నుండి ఫారెస్ట్ మార్గం ద్వారా తుమ్మెనలకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ సహదేవ్, రత్నం మాణిక్యం లు ఉన్నారు.
దర్యాప్తు లో బాగంగా జగిత్యాల జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఆదేశానుసారం , జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ ఆధ్వర్యం లో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసు విచారణలో కొందరు నిండుతులు దర్మపురి మండలం లోని తుమ్మెనల గుట్ట దగ్గర ఉన్నారని నమ్మకమైన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం 11.00 గం సహదేవ్ హోటల్ దగ్గర ఆరుగురు నింధితులను అదుపులోకి తీసుకొని, తులాల బంగారం గోల్డ్ చైన్ పుస్తెలతాడు రింగు సెల్ ఫోన్లు రెండు బైకులు నగదు స్వాధీనపరుచుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు మరొకరు పరారీలో ఉన్నారు
ఈ కేసు ఛేదించిన CI వై. కృష్ణారెడ్డి, SI కుమారస్వామి, సదాకర్, శ్రీదర్ రెడ్డి, దత్తాద్రి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్, కానిస్టేబుల్స్ గంగాధర్, శ్రీనివాస్, వెంకటేష్, ముత్తయ్య, సుమన్, రవి, రమేశ్ నాయక్, లింగారెడ్డి, శివ, పరమేష్, జలంధర్ మరియు టెక్నికల్ టీమ్ లను అభినందించి జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అభినంధించి నగదు ప్రోత్సాహకం అందజేశారు