విద్యార్థుల ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు, భోధనా రుసుము వెంటనే విడుదల చేయాలి జిల్లా బిసి సంక్షేమ సంఘం డిమాండ్.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 18( ప్రజా మంటలు ) :
జిల్లా కేంద్రంలో జరిగిన బిసి సంక్షేమ సంఘం సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ......
- రాష్ట్రంలో గత ఐదేళ్లుగా పెండింగ్‍లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు, బోధనా రుసుములు రూ.లు 4967.18 కోట్లు ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.
- గత 5 సంవత్సరముల నుండి పేద, బడుగు, బలహీనవర్గాల, విద్యార్థుల బకాయిలు పెండింగ్ లో ఉండడంవల్ల ఉన్నత చదువులు చదవలేక పోతున్నారని ఇంటర్‍మీడియట్ చదివినవాళ్ళు, డిగ్రీ చదవడానికి, డిగ్రీ చదివినవాళ్లు పీజీ చదవడానికి, పై ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. మరియు
- పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని కావున రాష్ట్ర ప్రభుత్వము కళ్ళు తెరిచి ఈ ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు, భోధనా రుసుములు రూ.లు 4967.18 కోట్లు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దండుగుల వంశీ, బి.సి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బీసీ సంక్షేమ సంఘం సాంస్కృతిక కార్యదర్శి బొమ్మిడి నరేష్ కుమార్, బిసి నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags