పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థికి పాముకాటు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం -బియరెస్ నాయకురాలు తుల ఉమ
పరిసరాలను పరిశీలించిన కలెక్టర్
పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థికి పాముకాటు
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం -బియరెస్ నాయకురాలు తుల ఉమ
జగిత్యాల డిసెంబర్ 19:
నిన్నటి ఘటన మరువకముందే ఈరోజు మరొక విద్యార్థికి పాముకాటుకు గురికావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని బియరెస్ నాయకురాలు తుల ఉమ విమర్శించారు.
నిజామాబాద్ నేషనల్ హై వే రోడ్ పై విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా ధర్నాలో మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ పాల్గొన్నారు.
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పాము కాట్ల కలకలం
8వ తరగతి విద్యార్థి ఓంకార్ అఖిల్ కు పాముకాటు కోరుట్ల ప్రైవేట్ ఆస్పత్రిలో కోలుకుంటున్న విద్యార్థి.
మరో విద్యార్థి బోడ యశ్వంత్ పాము కాటు అనుమానంతో ఆసుపత్రిలో చేరిక.
24 గంటల వ్యవదిలో ఇద్దరు విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం కలకలం.
గత ఆగస్టు మాసంలో పాముకాటుతో ఇద్దరు విద్యార్థులు మృతి.
తాజాగా ఇద్దరు విద్యార్థులు పాము కాటుతో ఆసుపత్రిలో చేరడంతో కుటుంబ సభ్యుల ఆందోళన.
పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ సత్యప్రసాద్.
పరిసరాలను పరిశీలించిన కలెక్టర్
గురుకులంలో పాము కనిపించలేదని చెప్తున్న విద్యార్థులు.
గురుకులంలో గదుల్లోకి పాములు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసిన కలెక్టర్.
నిన్న ఆసుపత్రిలో చేరిన అఖిల్ కు పాము కాటు అని అనుమానమే తప్ప నిర్ధారణ కాలేదని వెల్లడి.
అఖిల్ పక్కనే ఉన్న మరో విద్యార్థి యశ్వంత్ భయంతో ఆసుపత్రిలో చేరాడని వెల్లడి.
ఇద్దరు విద్యార్థులు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని... ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కలెక్టర్.
గదుల్లోకి పాములు, పురుగులు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాం.
ఇంకా చిన్నచిన్న గ్యాబ్ లు ఏమైనా ఉంటే ఈరోజు సాయంత్రంలోగా పూడ్చివేస్తాం- జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్