బి అర్ ఎస్ వల్లే మూసీ భాగోతం బట్ట బయలు - మూసీ సుందరీకరణ పేరిట ప్రపంచ బ్యాంక్ కు ఇచ్చిన నివేదిక బహిర్గతం - కల్వకుంట్ల కవిత
బి అర్ ఎస్ వల్లే మూసీ భాగోతం బట్ట బయలు
- మూసీ సుందరీకరణ పేరిట ప్రపంచ బ్యాంక్ కు ఇచ్చిన నివేదిక బహిర్గతం - కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ డిసెంబర్ 18:
ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వడంతో ప్రపంచ బ్యాంకు కోరినట్లు ప్రభుత్వం చేప్పడం బీఆర్ఎస్ పార్టీ విజయమని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
ఇంకా ఆమె ప్రకటనలో ఇలా తెలిపారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై వివరాలను దాచే ప్రయత్నం చేయడం బాధాకరం. చిన్న భాగానికే రూ 4100 కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు అడిగామని ప్రభుత్వం అంటున్నది
మరి చిన్న భాగానికే ఇంత వ్యయం అవుతే... మరి మొత్తం ప్రాజెక్టు వ్యయం ఎంతా ?రియల్ ఎస్టేట్ అభివృద్ధే లక్ష్యం అని పీపీఆర్ ను బట్టి అర్థమవుతోంది
డబ్బులు సంపాదించే అంశాలను పీపీఆర్ లో ప్రభుత్వం ప్రస్తావించింది . మురుగునీటి ప్రాజెక్టుకు మాత్రమే ప్రపంచ బ్యాంకును రుణం అడిగామని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు
కానీ పీపీఆర్ లో మాత్రం రియల్ ఎస్టేట్ చేస్తామని, గొప్ప మాల్స్ కడుతామని, వ్యాపారం చేస్తామని పేర్కొన్నారు. పేదల భూములు లాక్కొని ... పెద్దలకు పంచేదే మూసీ ప్రాజెక్టు
బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం వల్ల ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పింది. ఇన్ని రోజులు దాడిపెట్టిన విషయాలు బీఆర్ఎస్ పార్టీ వల్ల వెలుగులోకి వచ్చాయి.మూసీ ప్రాజెక్టుపై ఇంత కాలం ప్రజలను ప్రభుత్వం మభ్యపెట్టింది