2024 క్రైమ్ రేట్ పెరిగినప్పటికీ శాంతి భద్రతలు నియంత్రణలో ఉన్నాయి - జిల్లా ఎస్పీ అశోక్
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 26 (ప్రజా మంటలు) :
జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వార్షిక నివేదికను విడుదల చేసిన ఎస్పీ అశోక్ కుమార్
ఎస్పీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ...
- గత ఏడాదితో పోల్చితే 2024లో క్రైమ్ రేట్ పెరిగిందని. గత ఏడాది 4999 కేసులు నమోదు అయితే ఈ సంవత్సరం 5919 కేసులు నమోదయ్యాయి.
- అత్యధికంగా జగిత్యాల టౌన్ పిఎస్ లో 791 కేసులు నమోదు కాగా బీర్పూర్ పిఎస్ లో 120 అతి తక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపారు.
- గతంతో పోలిస్తే చోరీలు, రేప్ కేసులు తగ్గగా కిడ్నాప్ కేసులు పెరిగాయని, ప్రాపర్టీ కి సంబంధించిన 373 నమోదు కాగా, 182 కేసులు డిటెక్ట్ చేశామన్నారు.
- 76 లక్షల 76 వేల 600 రూ.ల ప్రాపర్టీ రికవరీ చేయగలిగాం.
- ఈ సంవత్సరం 451 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 176 మంది మృతి చెందగా, 426 మంది గాయపడ్డారని తెలిపారు.
- ఈ సంవత్సరం సైబర్ క్రైమ్ కేసులు 45.65% గణనీయంగా పెరిగాయని, అలాగే 1289 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని అన్నారు.
- 8 కోట్ల 58 లక్షల 55 వేల 559 రూపాయలు బాధితులు మోసపోయారు.
- కోటి 12 లక్షల 40 వేల 544 రూపాయల రికవరీ చేయగలిగాం, మరో కోటి 27 లక్షల రూపాయలు హోల్డ్ లో పెట్టించామన్నారు.
- రాబోయే 2025 సంవత్సరంలో మరింత పటిష్టంగ పని చేసి శాంతి భద్రతలు కాపాడంతోపాటు జవాబుదారితనం పారదర్శకతను పెంచేలా కృషి చేస్తామన్నారు.
Tags