అణగారిన వర్గాల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడు జ్యోతిరావు పూలే
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి
ప్రజామంటలు నవంబర్ 28 (ఎల్కతుర్తి) :
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పూలతో పూలే చిత్రపటానికి ఘనమైన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, సమాజంలో కుల వివక్షత అంటరానితనంపై పోరాటం చేసి వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పిస్తూ విద్యపై మళ్లించి వెలుగులు నింపిన మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు. ఇవే కాకుండా స్వేచ్ఛ, సమానత్వం, జ్ఞానం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్త్రీలకు విద్య పైపు మళ్ళించడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బలహీన వర్గాలకు జ్ఞానం అందించాలనే సంకల్పంతో తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యను మొదటగా బోధించిన తరువాత గ్రామ గ్రామాన తిరుగుతూ విద్య బోధన నేర్పిన తను ఆ ఫలాలే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలలో చీకటి నుండి చీల్చుకుంటూ వచ్చిన వెలుగుల వలె వెలుగుతున్నారని అన్నారు ఇలాంటి గొప్ప సంస్కరణలు చేసిన విద్యావేత్త ఉద్యమకారుడికి మరోసారి ఘనమైన నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి మాజీ అధ్యక్షుడు సంతాజి ఎల్కతుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు అనిల్ సింగిల్ విండో డైరెక్టర్ ముప్పు మహేందర్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శనిగరం వెంకటేష్ బొల్లె పోగు రమేష్ బాబు మండల ప్రధాన కార్యదర్శి గూడెల్లి నవీన్ కుమార్ గోపాల్పూర్ ఉపసర్పంచ్ స్వేచ్ఛ దామెర మాజీ వార్డ్ మెంబెర్ రాజేశ్వరరావు యూత్ కాంగ్రెస్ నాయకులు శనిగరపు సాహూ, నితిన్, కోరే పున్నం చందర్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.