ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 21( ప్రజా మంటలు )
సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశ ప్రాచీన వారసత్వం ఇచ్చిన విలువైన కానుక ధ్యానం, యోగా అని వీటితో మానసిక, శారీరక ఆరోగ్యం పై పట్టు సాధించవచ్చు అని జిల్లా ఎస్పీ అన్నారు.
అంతర్జాతీయ మొదటి మెడిటేషన్ (ధ్యానం) దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మెడిటేషన్ (ధ్యానం) దినోత్సవను వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ....
- శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం బిజీ బిజీ గా ఉండే అధికారులు, సిబ్బంది నిత్యం ధ్యానం,యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టుసాధించన్నారు.
- అధికారులు, సిబ్బంది నిత్యం విధినిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సమర్థవంతంగా సేవలందించగలమని అన్నారు.
- మిగతా ఎక్సర్సైజ్ లగా కాకుండా , ఎక్కడైనా, ఎలాంటి వ్యాయామ పరికరాలు అవసరం లేకుండా ఆరోగ్యాన్ని మానసిక సమతుల్యత లభించే ఏకైక మార్గం ధ్యానం ,యోగ అని అన్నారు.
- యోగా ద్వారా మెరుగైన జీవనం, అద్భుతమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఉత్తమ ఆలోచనలు కలుగుతాయన్నారు.
- అధికారులు , సిబ్బంది యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం ద్వారా ఆనందకర జీవితాన్ని పొందగలరని అన్నారు.
- ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ అరగంట పాటు యోగా చేస్తే చాలా వరకూ లైఫ్ స్టయిల్ అనారోగ్యం పాలుకాకుండా ఉండవచ్చనన్నారు.
ఈ సందర్భంగా యోగ శిక్షకుల తో కలసి ఎస్పీ అధికారులు,సిబ్బంది ధ్యానం , యోగా చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ లు రఘు చందర్, రాములు, సి.ఐ శ్రీనివాస్ ,రామ్ నర్సింహారెడ్డి, అరిఫ్ అలీ ఖాన్, వేణుగోపాల్, ఆర్.ఐ రామక్రిష్ణ, వేణు ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.
Tags