కూడా చైర్మన్ ను సన్మానించిన మండల రెడ్డి సంఘం నాయకులు*

On
కూడా చైర్మన్ ను సన్మానించిన మండల రెడ్డి సంఘం నాయకులు*

భీమదేవరపల్లి డిసెంబర్ ఒకటి (ప్రజామంటలు) :

భీమదేవరపల్లి రెడ్డి సంఘం అధ్యక్షులు కొడకండ్ల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డిని కొత్తకొండ ఆలయంలో ఘనంగా సన్మానించారు. వివరాల్లోకి వెళితే ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయాన్ని కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి తన కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల రెడ్డి సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చాడ సత్యనారాయణరెడ్డి, సంఘ ప్రధాన కార్యదర్శి కొట్టే కృష్ణారెడ్డి, కేతిరి లక్ష్మారెడ్డి, చందుపట్ల రాజిరెడ్డి, కొంగల రామచంద్రారెడ్డి, కాత సుభాష్ రెడ్డి, రావుల మోహన్ రెడ్డి, గుర్రాల భాస్కర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రామారం గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షులు ఎడబోయిన మహేందర్ రెడ్డి, రెడ్డి సంఘ ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రమణారెడ్డి వివిధ గ్రామాల సభ్యులు పాల్గొన్నారు.

Tags