ఘనంగా అయ్యప్ప మెట్లపూజ మహోత్సవం 

On
ఘనంగా అయ్యప్ప మెట్లపూజ మహోత్సవం 

ఘనంగా అయ్యప్ప మెట్లపూజ మహోత్సవం 

గొల్లపల్లి డిసెంబర్ 27 (ప్రజా మంటలు):

 మండలంలోని చిల్వాకోడూర్  లో తాండ్ర వినోద లక్ష్మణ్ గౌడ్ ధర్మకర్తలు ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప ఆలయం గుట్టపై  నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మెట్ల పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగాయి గురుస్వాములు చండీ ఉపాసకులు  ఈదుల వాడ వినయ్ శర్మ కరకముల చేత  శ్రీ గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, గౌరీ దేవి, శ్రీ చక్ర అర్చన, శ్రీ అయ్యప్ప స్వామి అభిషేకం, మెట్ల పూజ, జ్యోతి ప్రజ్వలన,  పూజలు  నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి పేట తుల్లి ఆటలు, నృత్యాలు, పాటలతో, అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.ఈ కార్యక్రమంలో గురు స్వాములు గందె వేణు,గంధం పరంధాములు, అల్లాడి వెంకన్న, తొట్ల లక్ష్మీరాజం,  బొమ్మెన కుమార్, పప్పుల వెంకన్న, గర్వందుల గంగన్న, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags