సిటీకి చేరుకున్న టిబెట్ యూత్​ కాంగ్రెస్​ బైక్​ ర్యాలీ    * అభినందించిన ప్రముఖ మెజిషీయన్​ సామల వేణు

On
సిటీకి చేరుకున్న టిబెట్ యూత్​ కాంగ్రెస్​ బైక్​ ర్యాలీ    * అభినందించిన ప్రముఖ మెజిషీయన్​ సామల వేణు

సిటీకి చేరుకున్న టిబెట్ యూత్​ కాంగ్రెస్​ బైక్​ ర్యాలీ
   * అభినందించిన ప్రముఖ మెజిషీయన్​ సామల వేణు

సికింద్రాబాద్​ డిసెంబర్​ 26 (ప్రజామంటలు):

చైనా నుండి టిబెట్ కు విముక్తి కల్పించాలని కోరుతూ అలాగే యాభై, అరువై సంవత్సరాల క్రితం భారత్ టిబెట్ కు చేసిన సహాయానికి కృతజ్ఞతగా టిబెట్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా బోర్డర్ అరుణాచల్ ప్రదేశ్ నుండి బైక్ ర్యాలీ నిర్వహిస్తునట్లు టి వై సి ప్రెసిడెంట్ టామో గంపో తెలిపారు. అలా బయలుదేరిన బైక్ ర్యాలీ 26 వరోజు తెలంగాణ లోని హైదరాబాద్ చేరుకున్నట్లు తెలిపారు.హైదరాబాద్ సికింద్రాబాద్ చేరుకున్న బైక్ ర్యాలీని ప్రముఖ మేజిషియన్..ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్, నేషనల్ యూత్ అవార్డు గ్రహీత సామల వేణు తోపాటు తదితరులు ఎదురు వెళ్ళి స్వాగతం పలికి వారికి సంఘీభావం తెలుపుతూ సన్మానం చేశారు..టిబెట్ కు చెందిన టి వై సి యూత్ నాయకులు 15 మంది రెండు నెలలు, ఇండియా లో 19 రాష్ట్రాల్లో 20 వేల కిలో మీటర్లు బైక్స్ పై తిరుగుతున్న  వారి కృతజ్ఞతకు సాహసానికి నిదర్శనమని సామల వేణు  వారిని అభినందించారు..ఈ బైక్ ర్యాలీ అరుణాచల్ ప్రదేశ్.. అస్సాం, నాగాలాండ్,మేఘాలయ, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్ గఢ్,ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు చేరుకున్న బైక్ ర్యాలీ అనంతరం ఈరోజు  కర్ణాటక కు బయలుదేరి వెళ్ళింది.

Tags