జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై అర్ధరాత్రి గొడవ ఓ వ్యక్తిని చితకబాదిన పలువురు యువకులు

On
జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై అర్ధరాత్రి గొడవ ఓ వ్యక్తిని చితకబాదిన పలువురు యువకులు

జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై అర్ధరాత్రి గొడవ
ఓ వ్యక్తిని చితకబాదిన పలువురు యువకులు

(సిరిసిల్ల రాజేందర్ శర్మ)

జగిత్యాల డిసెంబర్ 23

జిల్లా కేంద్రంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు...చిన్న చిన్న కారణాలతో గొడవలకు దిగి, చితకబాదుతున్నారు.అర్ధరాత్రి జగిత్యాల జిల్లా కేంద్రంలో కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించి, ముగ్గురు యువకులు కలిసి తీవ్రంగా దాడి చేశారు.

పక్కనే ఉన్న మోరిలో పడేసి బండరాయితో మోదారు...పలువురు వారించే యత్నం చేసిన యువకులు వినలేదు...ఫలితంగా కారులోని వ్యక్తి
తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నాడు..మరి చితకబాదిన యువకులెవరో తెలియాల్సి ఉంది.

థరూర్ గ్రామానికి చెందిన వ్యక్తిని, హార్డ్ వేర్ ఉద్యోగిని, కారు హారన్ కొట్టినందుకు, వెంటాడి, ఆపి మరి కొట్టారని బాధితుడు తెలిపారు.ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు

Tags