ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో పంట దిగుబడి ఎక్కువ. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9348422113/9963349493).
రాయికల్ నవంబర్ 25 (ప్రజా మంటలు) :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మనం పోల్చి చూస్తే ఈసారి వరి ధాన్యం అత్యధిక దిగుబడి రావడం శుభ పరిణామమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
రాయికల్ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు.
కాలేశ్వరం మేడిగడ్డ ఎత్తిపోతలు నిలిచిపోయినప్పటికీ దాని ప్రభావం లేకుండా శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ గాని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రదానంగా ఈసారి ఓవర్ ప్లో అయింది.
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ మేడిగడ్డ ఎత్తిపోతల ప్రభావం లేకున్నా వరద కాలువ ద్వారా మిడ్ మానేరు ఎల్లండి తో పాటు మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ కూడా ప్రాజెక్ట్ రిజర్వాయర్ నింపుకునే అవకాశం ఏర్పడిందన్నారు.
పంట దిగుబడికి అనుగుణంగా రైతాంగానికి మద్దతు ధర కల్పనకు సంబంధించి ఏ విధం అయినటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ గలగడం కానీ ధాన్యం సేకరణ కానీ జరిగాయన్నారు.
రైతు కొంత ఆరంభంలో పచ్చి వడ్లు మిల్లులకు అమ్మారు కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కావడంతో ఏ విధం అయిన సమస్య లేకుండా రాష్ట్రంలో 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయడం జరిగిందని తెలిపారు.
22 లక్షలలో దాదాపు 6 లక్షల పై చిలుకు సన్నరకాలు ప్రత్యేకంగా సన్నరకాలు అని ఎందుకు చెప్తున్నా అంటే క్వింటాలుకి 500 రూపాయలు బోనస్ లభిస్తుంది రైతులకు జగిత్యాల జిల్లాలో కూడా గత సంవత్సరం తేదీ 24 నవంబర్ 2024 సంవత్సరంలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగినట్లు పేర్కొన్నారు.
ఈ సంవత్సరం 24 నవంబర్ 2025 నాటికి 1 కోటి 44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది గతానికి ఇప్పటికి పోలీసుకుంటే దాదాపు రెట్టింపు ధాన్యం సేకరణ జరిగిందని తెలిపారు.
రైతు చెల్లింపులు కూడా వెనువెంట డబ్బులు చెల్లింపులు రెండు రోజులలో జరుగుతున్నాయన్నారు.
సన్నరకాలకు సంబంధించి రైతులలో అవగాహన రావాలి మన దగ్గర దాదాపు 10 వేల క్వింటాళ్ల సేకరణ జరిగిందన్నారు.
రైతులు జై శ్రీరామ్ డిమాండ్ ఉంది కనుక డైరెక్ట్ గా విక్రయిస్తున్నారు
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు సెంటర్ లలో మాత్రమే విక్రయించుకోవాలి ప్రభుత్వ కొనుగోలు సెంటర్ లలో మాత్రమే 500 రూపాయల బోనస్ వస్తుందని ప్రయివేట్ కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తే 500 రూపాయల బోనస్ వర్తించదన్నారు.
రైతాంగం అమాయకత్వంతో ప్రైవేట్ కొనుగోలు కేంద్రాలలో రేట్ ఎక్కువ వస్తుందని విక్రయిస్తే రేట్ రావడం లేదు బోనస్ పొందలేక పోతున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలంలో గత ప్రభుత్వం టిఆర్ఎస్ అప్పుల ఉబిలోకి నెట్టబడడంతోని ఏ నెలకి ఆ నెల వనరులు సమీకరించుకుంటూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే పరిస్థితి ఉంది వాస్తవంగా రుణమాఫీకి సంబంధించి కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం సంకల్పించిందో వాస్తవంగా కొంత మిగిలి ఉన్నది కానీ మిగిలి ఉన్న రైతాంగానికి కూడా రెండు లక్షల రూపాయల వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత దానికి ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది.
మిగిలిన రైతాంగానికి సంబంధించి దేశంలో ఉన్న రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా రుణమాఫీ అమలు చేయబడుతున్న రాష్ట్రం ఎక్కడ లేదు.
2023 ఎన్నికల మేనిఫెస్టోలో టిఆర్ఎస్ పార్టీ రుణమాఫీ అంశాన్ని తొలగించారు అమలు చేస్తానని పేర్కొనలేదు.
బిజెపి పాలిత రాష్ట్రాలలో కూడా ఎక్కడ రుణమాఫీ చేస్తున్న ఉదాంతం లేదు దేశంలో రైతాంగానికి మేలు ఓనగూర్చే విధంగా రైతు పక్షపాతిగా వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరతో పాటు వరి ధాన్యం సన్న రకాలకు 500 రూపాయలు బోనస్ మద్దతు ధరతో పాటుగా రైతాంగాన్ని రుణ విముక్తులను చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మనం గమనిస్తున్నామన్నారు.