అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యురాలు అరెస్ట్
On
అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యురాలు అరెస్ట్
జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
జగిత్యాల పాత బస్టాండ్ లో జరిగిన చొరిలో పాల్గొన్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యురాలుని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు
జగిత్యాల డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డిఎస్పీ రఘుచందర్ ప్రెస్ మీట్ మాట్లాడుతు వారం రోజుల క్రితం జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ లో జరిగిన చోరీ కేసులో 37 తులాల బంగారం దొంగతనం జరుగగా నేరస్థులను 4 గురు మహారాష్ట్రలోని నాగపూర్ చెందిన వారుగా గుర్తించి అందులో ఒకరిని అరెస్ట్ చేశామని మిగితా ముగ్గురు నేరస్తులు పరారి లో ఉన్నారని తెలిపారు. ముఠాలోని సభ్యురాలు నుండి 37 తులాల బంగారం కు గాను 31 తులాల బంగారం రికవరీ చేశామని మిగితా 7 తులాల బంగారం, ముగ్గురు నేరస్థులను త్వరలో పట్టుకుంటమని తెలిపారు.
Tags