రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న ప్రాణదాత కటుకం గణేష్

On
రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న ప్రాణదాత కటుకం గణేష్

రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న ప్రాణదాత కటుకం గణేష్

కోరుట్ల నవంబర్ 25:-
డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ 93 వ జయంతి మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ 149 వ జయంతి పురస్కరించుకొని అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో  ఆదివారం హైదారాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లెజెండరీ-2024
కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక, సంఘ సేవకుడు, రక్తదాన సంధాన కర్త, ప్రాణదాత కటుకం గణేష్ ను డా.ఎ.పి.జె  అబ్దుల్ కలాం లెజెండరీ 2024 అవార్డు ను అందించి  సత్కరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ S.సరోజనమ్మతో పాటు సినీ నటుడు నరేన్ తేజ్ పలువురు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ ఉమ్మడి ఉత్తర తెలంగాణ జిల్లాలలో రక్తదానం పై కటుకం గణేష్ యువతలో విస్తృత అవగాహన కల్పించి, వేలాది మంది రక్తదాతలను స్వచ్చంధ రక్తదాతలుగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని, 
గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలు, స్వచ్చంధ రక్తదాతలచే రక్తదాన సంధాన కర్తగా నిర్వహించిన పాత్ర స్ఫూర్తిదాయకంగా నిలిచాయని వారు పేర్కొన్నారు. 
ఇదివరకే పలు రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన గణేష్ కు అబ్దుల్ కలాం లెజెండరీ అవార్డు అందించడం తమ సంస్థకు గర్వకారణంగా నిలుస్తుందన్నారు. 
గణేష్ ఆధ్వర్యంలో మరిన్ని సమాజహిత కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఆయనకు తమ లాంటి స్వచ్చంధ సంస్థలు వెన్నుదన్నుగా ఉంటాయని వారు తెలిపారు.
అనంతరం అవార్డు గ్రహీత కటుకం గణేష్ మాట్లాడుతూ తన సేవలను గుర్తింపుగా అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారు డా..ఎ.పి.జె  అబ్దుల్ కలాం లెజెండరీ-2024 అవార్డు కు ఎంపిక చేసి అవార్డును ప్రధానం చేయడం సంతృప్తిని అందించిందని, రక్తదానం పై తాను మరిన్ని విస్తృత కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికను రూపొందించుకున్నానని, తనకు సహకరిస్తున్న స్వచ్చంధ రక్తదాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.

Tags