మారింది పాలకులే.. పాలన కాదు ఏడాది కాంగ్రెస్ పాలనపై భాజపా చార్జిషీట్. భాజపా సీనియర్ నేత కన్నం అంజయ్య

On
మారింది పాలకులే.. పాలన కాదు ఏడాది కాంగ్రెస్ పాలనపై భాజపా చార్జిషీట్. భాజపా సీనియర్ నేత కన్నం అంజయ్య

మారింది పాలకులే.. పాలన కాదు
ఏడాది కాంగ్రెస్ పాలనపై భాజపా చార్జిషీట్.
భాజపా సీనియర్ నేత కన్నం అంజయ్యIMG-20241205-WA0711
ధర్మపురి డిసెంబర్ 05:
తెలంగాణ రాష్ట్రంలో అధికార బదిలీ జరిగి పాలకులు మారారే కాని, పాలన మాత్రం ఏమాత్రం మారలేదని బి జె పి సీనియర్ నేత,కన్నం అంజయ్య ఆరోపించారు. ధర్మపురి క్షేత్రంలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ఆంజయ్య ప్రసంగిస్తూ...నాడు తెరాస ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దొచ్చుకుంటే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరుతో ఎసరు పెడుతున్నదని.
ఆరోపించారు. నాడు 12మంది ఎమ్మెల్యేలను పార్టీ మార్పిస్తే, నేడు 20మందిని చేర్చు కున్నారని విమర్శించారు. ధరణితో 19లక్షలరైతుల భూములు మాయ మైతే, హైడ్రా పేరున కూల్చి వేతలు జరుగుతున్నాయని దుయ్య బట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి అని మోసం చేసిందని, చేయూత పెన్షన్లు రావడం లేదని, సొంతిల్లు కలగానే మిగిలిందని, రైతు భరోసా లేదని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో భాజపాను ఆదరించాలని కోరారు.
నాయకులు నలమాసు వైకుంఠం, పిల్లి శ్రీనివాస్, కస్తూరి సత్యం, కస్తూరి మురళి, బండారి లక్ష్మణ్, ఆకుల శ్రీనివాస్, బెజ్జారపు లవన్, గాజు భాస్కర్, రాజేశ్, నరేష్ తదితరులు వేదికాశీనులు అయినారు. వందలాదిగా పాల్గొన్నారు.

Tags