కలత చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు

గుడిలో గ్రూపు రాజకీయాలు

On
కలత చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు

సీనియర్ నాయకుల అసంతృప్తి

భీమదేవరపల్లి డిసెంబర్ 1 (ప్రజామంటలు) :

మండలంలోని కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి ఆశీర్వచనం సందర్భంగా కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన తోపులాటలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిట్టెంపల్లి ఐలయ్యను సొంత పార్టీ నాయకులు నెట్టి వేయడంతో స్వల్పంగా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనతో చిట్టెంపల్లి ఐలయ్య తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాపోయారు.

Tags