భూ భార‌తితో రైతుల‌కు చేరువ‌కానున్న రెవెన్యూ సేవ‌లు

On
భూ భార‌తితో రైతుల‌కు చేరువ‌కానున్న రెవెన్యూ సేవ‌లు

భూ భార‌తితో రైతుల‌కు చేరువ‌కానున్న రెవెన్యూ సేవ‌లు
జగిత్యాల డిసెంబర్ 22:
భూప‌రిపాల‌న‌లో సువ‌ర్ణాద్య‌యంగా   అసెంబ్లీలో భూ భారతి కొత్త ఆర్వోఆర్ చ‌ట్టం -2024  బిల్లు పాస్ కావడం పట్ల తెలంగాణ అల్ సీనియర్ సిటీజీన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,  జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్  హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన సీనియర్ సిటీజేన్స్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు,ప్రజలకు మెరుగైన ,నాణ్యమైన రెవెన్యూ సేవలను అందించేందుకు నూతన ఆర్వో ఆర్ చట్టాన్ని తెచ్చిందన్నారు.చట్టాన్ని తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,చట్ట రూపకల్పనలో సీసీఎల్ ఏ నవీన్ మిట్టల్,భూ చట్టాల నిపుణులు సునీల్ కుమార్ లు ఎంతో కృషి చేశారన్నారు.చరిత్రలో నిలిచి పోయేలా నూతన ఆర్వో ఆర్ చట్టం ఉందని,రైతుల కోణం నుంచి,ప్రజల,రెవెన్యూ ఉద్యోగుల సంఘ ప్రతినిధుల అభిప్రాయాల మేరకు తయారు చేసిన చట్టం భూ భారతి ప్రతి స్థాయిలో రెవెన్యూ అధికారులు రైతులకు,ప్రజలకు సేవలను వేగంగా అందించే అవకాశం ఉంటుందన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో రెండు,తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ఆర్వో ఆర్ చట్టాలు వచ్చాయని,ఈ మూడింటి కంటే ఇప్పుడొచ్చిన భూ భారతి చట్టం తో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తమ అసోసియేషన్ తరపున ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,ఉపాధ్యక్షులుబొల్లం విజయ్, పి.సి.హన్మంత రెడ్డి,ఎం.డి.యాకూబ్,విఠల్,తదితరులు పాల్గొన్నారు.
Tags