అంబేద్కర్ ఆశయ సాధనే ఘనమైన నివాళి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
అంబేద్కర్ ఆశయ సాధనే ఘనమైన నివాళి
- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి నవంబర్ 26:.
భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను సిద్దింప చేసినపుడే ఆయనకు ఘనమైన నివాళి అర్పించినట్లు
కాగలదని రాష్ర్ట ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి
75 సంవత్సరాలు పూర్తయిన సంధర్భంగా ధర్మపురి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన చేసిన వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా ఆయన నివాళులర్పించారు.
అనంతరం మీడియాతో ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ...
దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26న ఆమోదించబడిన సందర్భంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, భారత దేశంలో ఉన్న అన్ని వర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రూపొందించడం జరిగిందనీ, ఆయన బాటలో నడుస్తూ వారి ఆశయాలను నెరవేర్చడమే అంబేద్కర్ గారికి ఇచ్చే ఘనమైన నివాళి అని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు