దిలావర్‌పూర్‌లో మళ్ళీ ఉద్రిక్తత    అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టాలని రోడ్డెక్కిన రైతులు

ఇథనాల్ పరిశ్రమ తరలించేంత వరకు అందలన చేస్తాం - రైతులు ఇథనాల్‌ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశాలు...

On
దిలావర్‌పూర్‌లో మళ్ళీ ఉద్రిక్తత    అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టాలని రోడ్డెక్కిన రైతులు

దిలావర్‌పూర్‌లో మళ్ళీ ఉద్రిక్తత    అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టాలని రోడ్డెక్కిన రైతులు

ఇథనాల్ పరిశ్రమ తరలించేంత వరకు అందలన చేస్తాం - రైతులు

ఇథనాల్‌ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశాలు...

నిర్మల్‌ నవంబర్ 27: : దిలావర్‌పూర్‌లో 
ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన రైతులు.

పురుగుల మందు డబ్బాలతో మహిళల బైఠాయింపు

అరెస్ట్ చేసినవారిని విడిచిపెట్టాలని డిమాండ్..

నిన్న రాత్రి విరమించిన ఆందోళనను తిరిగి ఉదయం చేపట్టారు. నిన్న ఆరు గంటలుగా ఆర్డీవోను నిర్బంధించిన రైతుల నుండి, ఎట్టకేలకు ఆర్డీవో ని అక్కడి నుంచి  పోలీసులు ఆమెను తరలించారు.

నిర్మల్‌ జిల్లా : 

దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌...

BRS హయాంలో ఇచ్చిన అనుమతులపై పునరాలోచనలో కాంగ్రెస్‌ సర్కార్‌....

ఇథనాల్‌ పరిశ్రమకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై పునఃసమీక్ష....

ఇప్పటికే ఇథనాల్‌ పరిశ్రమ వద్దంటూ గ్రామస్తుల ఆందోళన...

గ్రామస్తులతో కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ చర్చలు...

ఇథనాల్‌ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశాలు...

నిన్న జాతీయ రహదారిపై దిలావర్‌పూర్‌లో 12 గంటలు కొనసాగిన  రైతుల రాస్తారోకోఆరు గంటలుగా రోడ్డుపైనే వాహనంలోనే ఆర్డీవో రత్న కళ్యాణి ఆపిన రైతులు

కలెక్టర్ వచ్చే వరకు ఆర్డీవోను వదలం అన్న రైతులుScreenshot_2024-11-27-13-39-04-89_7352322957d4404136654ef4adb64504

8 నెలల నుండి ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు.. పిల్లాపాపలతో రోడ్డుపై బైఠాయించిన రైతులు. 

అస్వస్థతకు గురైన ఆర్డీవో..ఆసుపత్రికి తరలింపు


దిలావర్‌పూర్‌లో రైతులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు

పోలీసు వాహనాలను అడ్డుకున్న గ్రామస్థులు

ఉదయం నుంచి నిరసనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో గ్రామస్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకొని గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. 

ఇథనాల్ పరిశ్రమ తరలించేంతవరకు ఎన్ని అక్రమ అరెస్టులు జరిగినా భయపడేది లేదన్నారు.

Tags