ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వేగవంతంగా పరిష్కరించాలి. - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.

On
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వేగవంతంగా పరిష్కరించాలి. - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల నవంబర్ 25 (ప్రజా మంటలు) : 

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార  మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ బి.ఎస్ లత (రెవెన్యూ ) అదనపు కలెక్టర్ (ఏసిఎల్బి) గౌతమ్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... దరఖాస్తు దారుని సమస్య పై వచ్చే అర్జీలను ఆయా సంబందిత శాఖల అదికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకుని అర్జీ దారునికి తెలియజేయాలని అన్నారు.

కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 35 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. ఎస్ లత, రెవెన్యూ అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి , జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీవో లు , మధు సుధన్, ఎన్. శ్రీనివాస్, జివాకర్ , కలెక్టరేట్ ఏ.ఓ. హన్మంతరావు, డిఆర్డిఏ రఘు వరణ్ వివిధ సంబందిత జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags