అంగరంగ వైభవంగా శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ

On
అంగరంగ వైభవంగా శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ

అంగరంగ వైభవంగా శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ

సికింద్రాబాద్​ డిసెంబర్​ 28 (ప్రజామంటలు):

సికింద్రాబాద్​ వెస్ట్​ మారేడ్​ పల్లిలోని  శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలోని సాయిబాబా దేవాలయ పూజారి యుగేంద్రాచార్యులు ఆధ్వర్యంలో శ్రీ శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమమున కు  ముఖ్యఅతిథిగా ఇన్​స్పెక్టర్​ ఆఫ్​ పోలీస్​ ఓఎస్​డీ వి.శివకుమార్​ దంపతులు హాజరయ్యారు. ఈసందర్బంగా అయ్యప్పస్వామికి క్షీరాభిషేకం నిర్వహించారు. స్వామివార్లకు పంచామృతాభిషేకం చేశారు. పూజ కార్యక్రమంలో  శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ మెంబర్లు,అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప మహాపడి పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందచేశారు.

Tags