తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే - జగిత్యాల ఆర్డీవో మధుసూదన్.   

On
తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే - జగిత్యాల ఆర్డీవో మధుసూదన్.   

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే - జగిత్యాల ఆర్డీవో మధుసూదన్.                           

జగిత్యాల డిసెంబర్ 28:

వయోవృద్ధులైన కన్న తల్లి,దండ్రుల పో షణ, సంరక్షణ బాధ్యత పిల్లలదే నని విస్మరిస్తే శిక్షార్హులేనని ,జైలు శిక్ష ,జరిమానా తదితర   చట్టపరమైన చర్యలు తప్పవని జగిత్యాల డివిజన్ ఆర్డీవో,వయోవృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పి.మధుసూదన్ హెచ్చరించారు.శనివారం ఆర్డీవో ఛాంబర్లో వయోవృద్ధుల పోషణ,సంరక్షణ చట్టం    సెక్షన్ 2(బీ),సెక్షన్ 4(1),సెక్షన్ 24 కింద నమోదు   అయిన  కేసుల్లో కొడుకులు,కోడళ్ళు,కూతుర్లు ఆర్డీవో ట్రిబ్యునల్ కోర్టు  ముందు విచారణకు హాజరయ్యారు.విచారణల్లో   బుగ్గారం మండలం బుగ్గారం గ్రామానికి చెందిన కళ్లెం చిన్నన్న ,గొల్లపల్లి  మండలం రాఘవపట్టణం గ్రామానికి చెందిన బోయపోతు రాజయ్య, జగిత్యాల పట్టణంకు చెందిన ఈళ్లేందుల  భాగ్యమ్మ,జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామానికి చెందిన మారవేణి గంగవ్వల ఫిర్యాదులపై వారి కొడుకులను, కూతుర్లను,కోడళ్లను ఆర్డీవో విచారించారు.    తమ కుమారులనుంచి పోషణ,వైద్య ఖర్చులు ఇప్పించాలనే కేసుల్లో ఆవృద్ధుల తరపున సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తన వాదనలు ఆర్డీవో కు వినిపించారు. కొడుకులు,కోడళ్ళకు,  ఆర్డీవో కౌన్సెలింగ్ చేశారు.అనంతరం ఆర్డీవో  ఫిర్యాదుదారుల, కొడుకుల,కోడళ్ల,కూతుర్ల, వాంగ్మూలం లను  విని సాక్ష్యాధారాలను పరిశీలించారు.అనంతరం 
 సంరక్షణ చట్టం 2007 సెక్షన్ 24 ప్రకారం వృద్ధులైన తల్లిదండ్రులను  పోషించక నిరాధరిస్తు వేధింపులకు గురిచేస్తున్న వారికి,నోటీసులు ఇచ్చినా హాజరు కాని వారికి ,తీర్పులు పాటించని వారికి  6 నెలల వరకు జైలు శిక్ష తో పాటు జరిమాన విధించే వీలుందని  కొడుకుల ను,కోడళ్లను ,కూతుర్లను ,  హెచ్చరిస్తూ  తల్లిదండ్రుల పోషణకు,సంరక్షణకు ఆర్డీవో  ఆదేశించారు. ఈ  విచారణ లో   ఆర్డీవో కార్యాలయ ఏవో.తఫజుల్ హుస్సేన్,సీనియర్ సిటీజేన్స్ జిల్లా కమిటీ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,కౌన్సెలింగ్  ప్రతినిధులు వెల్ముల ప్రకాష్ రావు,  గౌరిశెట్టి విశ్వనాథం,సీనియర్ సహాయకురాలు  పద్మజ, ఎఫ్.ఆర్.ఓ.కొండయ్య తదితరులున్నారు.

Tags