90 రోజుల యాక్షన్ ప్లాన్ ను సక్రమంగా అమలు చేయాలి
On
90 రోజుల యాక్షన్ ప్లాన్ ను సక్రమంగా అమలు చేయాలి
జగిత్యాల /గొల్లపల్లి డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కలెక్టర్ భవన సముదాయంలో ఇటీవల ఇంటర్మీడియట్ విద్యాధికారిగా బి. నారాయణ నియమితులైన సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్-711 జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం రోజున ఆయన ఛాంబరులో కలిసి శాలువాతో సన్మానం చేసి బొకే అందజేశారు
ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యాధికారి బి.నారాయణ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక జూనియర్ లెక్చరర్ 90 రోజుల యాక్షన్ ప్లాన్ ను సక్రమంగా అమలు చేసి ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వి. నరసయ్య, డాక్టర్ పి.తిరుపతి, రాజేష్,విజేందర్, ప్రమోద్ కుమార్, నరసయ్య, రాజేందర్, రవీందర్, దేవేందర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags