కొత్త ఏడాది2025 అందరికి శుభం చేకూర్చాలి  * కృష్ణవేణి గ్రూప్​ ఆఫ్​ స్కూల్స్​ చైర్మన్​ రాజు సంగని

On
కొత్త ఏడాది2025 అందరికి శుభం చేకూర్చాలి  * కృష్ణవేణి గ్రూప్​ ఆఫ్​ స్కూల్స్​ చైర్మన్​ రాజు సంగని

కొత్త ఏడాది2025 అందరికి శుభం చేకూర్చాలి
 * కృష్ణవేణి గ్రూప్​ ఆఫ్​ స్కూల్స్​ చైర్మన్​ రాజు సంగని

సికింద్రాబాద్,  డిసెంబర్28 (ప్రజామంటలు)::

రాబోవు నూతన సంవత్సరం అందరికి శుభ ఫలితాలను అందించాలని కృష్ణవేణి టాలెంట్​ గ్రూఫ్​ ఆప్​ స్కూల్స్​ చైర్మన్​ రాజు సంగని ఆకాంక్షించారు. శనివారం సంస్థ ప్రధాన కార్యాలయంలో భోలక్​ పూర్​ కృష్ణవేణి టాలెంట్ స్కూల్​ కు చెందిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్​ ను ఆయన ఆవిష్కరించారు. స్కూల్​ కరస్పాండెంట్​ డాక్టర్​ మంచాల శ్రీనివాసులు మాట్లాడుతూ...ప్రతి సంవత్సరం చిన్నారి విద్యార్థుల యాక్టివిటిస్​, విషయ పరిజ్ఞానానికి సంబందించిన సమాచారంతో కూడిన క్యాలెండర్లను రూపొందించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కొత్త ఏడాదిలో టెన్త్ క్లాస్​ స్టూడెంట్స్​ చక్కటి ఫలితాలు సాధించాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. న్యూ ఇయర్​ క్యాలెండర్లను స్టూడెంట్స్​ పేరేంట్స్​ కు అందచేస్తామన్నారు.  కార్యక్రమంలో కార్యాలయ ఇంచార్జీ లావన్య, సిబ్బంది పాల్గొన్నారు.

Tags