సీనియర్ సిటీజేన్స్ సమాజ మార్గదర్శకాలు. - కలెక్టర్ బి.సత్యప్రసాద్..

On
సీనియర్ సిటీజేన్స్ సమాజ మార్గదర్శకాలు. - కలెక్టర్ బి.సత్యప్రసాద్..

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల డిసెంబరు 18 (ప్రజా మంటలు) : 

సీనియర్ సిటీజేన్స్ సమాజ మార్గదర్శకులని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు.

కలెక్టర్ ఛాంబర్లో తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల శాఖ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ముద్రించిన 2025 డైరీలను,వృద్ధుల సంరక్షణ చట్టం పిలుపు మాస పత్రికలను కలెక్టర్ సత్యప్రసాద్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ....

  • సీనియర్ సిటీజేన్స్ అయిన తల్లిదండ్రులను విస్మరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
  • సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల,కోరుట్ల,మెట్ పల్లి డివిజన్లలో ఆర్డీవోలు వయోధికుల కేసుల సత్వర పరిష్కారంలో రాష్ట్రంలో నెంబర్ వన్ గా నిలిచారని తమ అసోసియేషన్ తరపున కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షులు పి.హన్మంత రెడ్డి,ఎం.డి.యాకూబ్,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,ఆర్గనైజింగ్ కార్యదర్శి పూసాల ఆశోక్ రావు,ఎం.డి.జబ్బార్,ఎం.డి.ఇక్బాల్,

దిండిగాల విఠల్,తదితరులు పాల్గొన్నారు.

Tags