వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు ఏర్పాట్లు ముమ్మరం. - ఎన్పీడీసీఎల్ ఎస్ఈ షాలియా నాయక్. 

On
వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు ఏర్పాట్లు ముమ్మరం. - ఎన్పీడీసీఎల్ ఎస్ఈ షాలియా నాయక్. 

సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

మెట్పల్లి నవంబర్ 27 (ప్రజా మంటలు) : 

రాబోయే వేసవి విద్యుత్ డిమాండ్ ను తట్టుకునే దిశగా జిల్లాలో పటిష్ట నెట్వర్క్ సిద్ధం చేస్తున్నట్లు, అన్ని పట్టణాలు, గ్రామాల్లో విరివిగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు జగిత్యాల ఎస్ఈ శాలియా నాయక్ పేర్కొన్నారు.

బుధవారం జగ్గాసాగర్ 33కెవి ఫీడర్ నుండి చౌలమద్ది సబ్స్టేషన్ వరకు రూ.25 లక్షలతో నిర్మించిన అంతర్గత, ప్రత్యామ్నాయ లైన్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్ఈ శాలియా నాయక్ మాట్లాడుతూ..... రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించుటకు ఎన్పీడిసీల్ సీఎండీ వరుణ్ రెడ్డి జిల్లాలో 12 అంతర్గత, ప్రత్యామ్నాయ 33కెవి లైన్ ల కొరకు మంజూరు ఇచ్చి, బడ్జెట్ కేటాయించారని, అందులో భాగంగా చేపట్టిన చౌలమద్ది ఫీడర్ ఒకటని తెలిపారు.

ఇది జిల్లాలో ప్రారంభించిన మొదటి లైన్ కావడం, రికార్డు సమయంలో పూర్తి చేయుటకు కృషి చేసిన స్థానిక అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్ ను అభినందించారు.

మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో చేపట్టిన మరో నాలుగు ఫీడర్లు టెండర్లు, నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు.

అందులో మెట్లచిట్టాపూర్ నుండి నిజామాబాద్ జిల్లా చౌట్పల్లి వరకు వేసే లైన్ వ్యూహాత్మకంగా నిలుస్తుందని అన్నారు. వాటన్నింటిని జనవరి ఆఖరు వరకు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు లక్ష్యం నిర్దేశించారు.

ఈ కార్యక్రమంలో ఎడీఈ మనోహర్, ఏఈ లు అజయ్, అమరేందర్, రవి, ప్రదీప్, సబ్ ఇంజినీర్లు నవీన్, రమేష్, సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

Tags