సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు.

On
సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల డిసెంబర్ 23 ( ప్రజా మంటలు ) : 

సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులు టి.శరణ్య, ఆర్. శైలజ, ఆర్. హారిక, టి.సహస్ర.. బాస్కెట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు పాఠశాల పీడి రాధిక తెలిపారు.

ఈనెల 26 నుండి హైదరాబాదులో జరిగే సీఎం కప్ పోటీల్లో వారు పాల్గొననున్నట్లు వివరించారు.. ఈ సందర్భంగా సోమవారం పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించి ధ్రువపత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు. .

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.... మరింతగా క్రీడల్లో రాణించి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏ రామానుజన్.. జి జయ శ్రీలత ఉపాధ్యాయ ..రజాక్. కమలాకర్ రెడ్డి..కరుణాకర్.. శ్రీనివాసరెడ్డి రజిత రాజేందర్.. ఉమేర సత్యనారాయణ..కుమార్.. తదితరులు పాల్గొన్నారు.

Tags