బీసీ రిజర్వేషన్లు పెంచి కాంగ్రెస్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. - బిసి రణభేరిలో వక్తలు
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 996349493/9348422113).
హైదరాబాద్ నవంబర్ 25 (ప్రజా మంటలు) :
సోమవారం రోజున ఉదయం 10 గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్ లో జరిగే బిసిల సమరభేరి కార్యక్రమానికి మన బిసి కులసంఘాల నాయకులు, బిసి సోదరులందరూ పెద్దఎత్తున తరలివచ్చి సమరభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.
ఈ రోజు బిసి సంక్షేమ సంఘం సమావేశంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మినారాయణ మాట్లాడుతూ..... 25సోమవారం రోజున ఉదయం 10 గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్ లో జరిగిన బిసి ల సమరభేరి కార్యక్రమానికి మన బిసి కులసంఘాల నాయకులు, బిసి సోదరులందరూ పెద్దఎత్తున తరలివచ్చి సమరభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, టి ఆర్ ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సి హెచ్ హన్మంతరావు, నాయకులు కోదండరాం, వకుళాభరణం కృష్ణప్రసాద్, గుజ్జ సత్యం, నీల వెంకటేష్, నందగోపాల్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ.... కులగణన సర్వే పకడ్బందీగా చేపట్టి, కులగణనలో జణగణన కార్యక్రమాన్ని వెంటనే చేపట్టి బీసీ లకు రిజర్వేషన్లు పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులగణన ప్రత్యేక కమిషన్ కు నివేదిక అందించాలని, బడుగు, బలహీన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో సరైన ప్రాధాన్యం కల్పించాలని, సమాజంలో అంతరాలను రూపుమాపడానికి, బలహీనవర్గాలను మరింత పైకి తీసుకురావడానికి ఈ ప్రభుత్వాలు కృషి చేయాలని, ముఖ్యంగా పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు రాజకీయరంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు పెంచాలని, దేశంలో అణగారిన కులాలను అణచివేసే దోరణి కొనసాగుతుందని, అధికారంలో బీసీలకు వాటా ఇవ్వకపోవడమే దీనికి నిదర్శనమన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేల్లయినా కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం దురదృష్టకరమన్నారు. మహిళా బిల్లులో బీసీ మహిళల కోటా, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేసి, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తే బీసీలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెబుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని గతంలో బీసీలను మోసం ఇప్పుడు కూడా మరోసారి బీసీలను మోసం చేయాలని చూస్తున్నారని, అదే ఇప్పటికైనా అసెంబ్లీలో కులగణన బిల్లు ప్రవేశపెట్టి, చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
కులగణనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన బీహార్ రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
అవసరమైతే కులగణన విధివిధానాల కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసేలా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు వచ్చేలా కుల సంఘాలన్నీ ఏకతాటి మీదిగా ఉండి పని చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దండుగుల వంశీ, బి.సి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బిసి సంక్షేమ సంఘం సాంస్కృతిక కార్యదర్శి బొమ్మిడి నరేష్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, బి.సి సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు గుంటి గంగారాం, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, ముద్దం గంగారెడ్డి, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.