ఆధిపత్యం కోసం కాదు అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు) :
కుల మత రహిత సమాజం విద్యతోనే సాధ్యమని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల గొల్ల పల్లి రోడ్డు లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ను సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రం నుండి తరలి పోయిన సోషల్ వెల్ ఫేర్ మహిళ డిగ్రీ కళాశాల ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో జగిత్యాల కు తీసుకువచ్చి 240 సీట్లు సాధించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కళాశాలలో సత్కరించి,ధన్యవాదాలు తెలిపిన జగిత్యాల జిల్లా దళిత సంఘాల సభ్యులు,కళాశాల ఉపాద్యాయులు, విద్యార్ధులు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ....
కుల మత రహిత సమాజం కావాలంటే విద్య తోనే సాధ్యం...
విద్యార్థినిలు గొప్ప లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటిని సాధించడానికి కృషి చేయాలన్నారు.
కళాశాల ను జగిత్యాల కు మళ్ళీ బదిలీ చేసిన ముఖ్యమంత్రి కి విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆడువాల జ్యోతి లక్ష్మణ్,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,కౌన్సిలర్ లు పద్మవతి పవన్,కూతురు రాజేష్,ప్రిన్సిపల్ శ్రీలత,కో ఆప్షన్ శ్రీనివాస్, నాయకులు బాలే శంకర్,ధుమాల రాజ్ కుమార్,బోనగిరి నారాయణ,చెట్పల్లి సుధాకర్,శరత్ రావు,గట్టు రాజు,సుమన్ రావు,భిక్షపతి,ప్రవీణ్ రావు,నక్క గంగాధర్,సంగెం శ్రీనివాస్,పవన్, సంకే మహేష్,క్రాంతి,సునీల్,సురేందర్,గంగాధర్,రవి,గంగారాం,తదితరులు పాల్గొన్నారు.