హత్యాయత్నం చేసిన వ్యక్తికి ఐదు సంవత్సరాలు జైలు, రెండు వేల జరిమానా
హత్యాయత్నం చేసిన వ్యక్తికి ఐదు సంవత్సరాలు జైలు, రెండు వేల జరిమానా
ఇబ్రహీంపట్నం జనవరి 28 (ప్రజా మంటలు):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్ష కొండ గ్రామంలో 2017లో వర్ష కొండ గ్రామానికి చెందిన రేగుంట చిన్న లక్ష్మయ్య @ లస్మయ్య, అదే గ్రామానికి చెందిన సల్వాల రాజేందర్ అనే వ్యక్తిపై భూతగాదా నేపథ్యంలో గొడ్డలితో దాడి చేసి హత్యా ప్రయత్నం చేశాడు. బాధితుడి భార్య సల్వాల పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఇబ్రహీంపట్నం ఎస్.ఐ. బి. రాము నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ప్రస్తుత ఎస్సై అనిల్ మరియు కోర్ట్ కానిస్టేబుల్ రాజేందర్ మరియు లైజనింగ్ ఆఫీసర్స్ మహిళా కానిస్టేబుల్ కవిత మరియు కానిస్టేబుల్ శ్రీధర్ సాక్షులను ప్రవేశపెట్టగా, మంగళవారం, 28న మెట్టుపల్లి సీనియర్ సివిల్ జడ్జ్ డి నాగేశ్వరరావు నిందితుడు రేగుంట చిన్న లస్మయ్య కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, మరియు 2000 రూపాయల జరిమానా విధించినారు.
కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించి కోర్టుకి సమర్పించిన అప్పటి ఎస్సై బి రాము ని మరియు ప్రస్తుత ఎస్సై అనిల్ ని, కోర్ట్ కానిస్టేబుల్ బి రాజేందర్, లైజనింగ్ ఆఫీసర్స్ కవిత మరియు శ్రీధర్ లను డి.ఎస్.పి ఏ రాములు, ఎస్పీ అశోక్ కుమార్,అభినందించారు.