చైనా విడుదల చేసిన డీప్ సీక్ ఏ ఐ టెక్ ప్ర పంచాన్ని కుదిపేస్తోంది
చైనా విడుదల చేసిన డీప్ సీక్ ఏ ఐ tek ప్రపంచాన్ని కుదిపేస్తోంది
అమెరికా దిగ్గజలకు చుక్కలు చూపిస్తున్న చైనా
న్యూ ఢిల్లీ జనవరి 28:
చైనా విడుదల చేసిన డీప్ సీక్.. టెక్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది. తన లేటెస్ట్ ఏఐ మోడల్ ఆర్1తో పెద్ద పెద్ద కంపెనీల షేర్లనే కుదిపేసింది.గత వారం, చైనీస్ స్టార్టప్ డీప్‌సీక్ ప్రస్తుత సేవల ఖర్చులో కొంత భాగానికి తక్కువ డేటాను ఉపయోగించే ఉచిత AI అసిస్టెంట్‌ను ప్రారంభించింది. ఒక నివేదిక ప్రకారం, సోమవారం నాటికి, అసిస్టెంట్ ఆపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్లలో US ప్రత్యర్థి ChatGPTని అధిగమించింది.
అమెరికా స్టాక్ మార్కెట్ లు డీప్ సీక్ దెబ్బకు కోట్ల డాలర్లను కోల్పోయాయి.బిలియన్ల డాలర్లు ఖర్చు చేసి అమెరికా సంస్థలు తయారుచేసిన AI లను తలదన్నే డీప్ సీక్ ఓపెన్ సాఫ్టువేర్ తయారీకి చైనా అతితక్కువ మొత్తమే ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.
డీప్‌సీక్: జనవరి 27న US స్టాక్‌లు చారిత్రాత్మక సోమవారం నాడు జరిగాయి, Nvidia షేర్లు దాదాపు 17% క్షీణించి, ఒకే రోజులో రికార్డు స్థాయిలో మార్కెట్ క్యాపిటలైజేషన్ను దాదాపు $600 బిలియన్లకు తుడిచిపెట్టాయి.
తక్కువ ధర కలిగిన చైనీస్ కృత్రిమ మేధస్సు మోడల్ అయిన DeepSeek ఆవిర్భావం Nvidia వంటి AI నాయకుల ఆధిపత్యాన్ని బెదిరిస్తుందనే ఆందోళనలు జనవరి 27న వాల్ స్ట్రీట్‌లో టెక్ స్టాక్‌లలో పతనానికి దారితీశాయి.
అమెరికా దిగ్గజలకు చుక్కలు చూపిస్తున్న చైనా!
ఇన్నాళ్లూ ఏఐలో తమదే పైచేయి అనుకుంటున్న అమెరికాకు సవాలు విసురుతోంది. మోస్ట్ అడ్వాన్స్డ్ చిప్స్‌ను చైనాకు ఎగుమతి కాకుండా అమెరికా నిలువరించినా.. అతి తక్కువ ఖర్చుతో రూపొందిన ఈ ఏఐ మోడల్ ఇప్పుడు ఆ ఇండస్ట్రీనే ఆలోచనలో పడేసింది. చైనా ఒక్క డీప్సిక్ మాత్రమే కాదు.. అనేక కంపెనీలు ఏఐ మోడళ్లను రూపొందించడంలో నిమగ్నమై ఉన్నాయి. 2030 నాటికి ఏఐలో అమెరికాకు తాము ఏమాత్రం తీసిపోకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నాయి.
అమెరికాలో మాదిరిగా చైనా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై భారీగానే ఖర్చు పెడుతోంది. ఏఐ చిప్ ఎగుమతులపై అమెరికా ఇటీవల ఆంక్షల నేపథ్యంలో సుమారు 60 బిలియన్ యువాన్లతో ఒక ఏఐ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌ను సిద్ధం చేసింది. అంతేకాదు.. సొంతంగా అడ్వాన్స్డ్ కంప్యూటర్ చిప్స్‌ను తయారు చేసుకునేందుకు సెమీకండక్టర్ పరిశ్రమపైనా పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తోంది. ఏఐ అకాడమీలు ఏర్పాటు, ప్రాథమిక, సెకండరీ పాఠశాల స్థాయిలోనే పాఠ్యాంశాల్లో ఏఐని జోడించాలన్న ఆలోచన చేస్తోంది. ఇప్పటికే అనేక పెద్ద పెద్ద కంపెనీలు ఎఐ మోడళ్లను సిద్ధం చేశాయి. ప్రస్తుతం అవి వాడుకలో ఉన్నాయి.
మందికి సుపరిచితమే. ఈ గ్రూప్ నకు చెందిన అలీబా క్లౌడ్ ఇప్పటికే Qwen-2.5-1M పేరిట ఓపెన్సోర్చు ఏఐ సిరీసన్ను విడుదల చేసింది.
ఇది పెద్ద పెద్ద ప్రశ్నలకు సైతం సులువుగా సమాధానాలు ఇవ్వగలదు. ప్రస్తుతం ఈ ఏఐ మోడలను చైనాలోని డెవలపర్లు, బిజినెస్ కస్టమర్లు తమ ప్రొడక్ట్ డెవలప్మెంట్లో వినియోగిస్తున్నారు. క్వెన్ పేరిట పౌరుల కోసం ఓ చాట్‌బాట్‌ను సైతం అలీబాబా విడుదల చేసింది.
• చైనాకు చెందిన సెర్చింజన్ సంస్థ బైడు ఎర్నీబాట్ను చైనా పౌరులకు అందుబాటులోకి తెచ్చింది. దాని సామర్ధ్యాలను మరింత పెంచేందుకు బాహ్య ప్రపంచం నుంచి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటోంది. చాటీపీటీ తరహాలో ఇది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు జనరేటివ్ ఇమేజ్‌లను సైతం అందిస్తుంది. 2024 జూన్ నాటికి దీనికి 300 మిలియన్ల యూజర్లు ఉన్నారు.
• టిక్‌టాక్ మాతృ సంస్థ బైటా డ్యాన్స్ గతవారం దుబావో 1.5 ప్రో లాంగ్వేజ్ మోడల్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం నెలకు 60 మిలియన్ యాక్టివ్ యూజర్లతో దూసుకెళుతోంది. చాటీజీపీటీ - 40కు తమ ఏఐ మోడల్
ఏమాత్రం తీసిపోదని బైట్ డ్యాన్స్ చెబుతోంది.
• బీజింగ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మూన్‌షాట్ అనే స్టార్టప్ సంస్థ కిమీ కే1.5ను విడుదల చేసింది. ఇది ఓపెన్ ఏఐ o1 మోడల్ కంటే మెరుగైన పనితీరు కనబరుస్తోందని కంపెనీ చెబుతోంది. కోడింగ్, మ్యాథమెటిక్స్, సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదని తెలిపింది. ఫొటో, వీడియో రూపంలో ఇన్పుట్స్ తీసుకుంటుందని చెబుతోంది.