లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సంజయ్
లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సంజయ్
(వనమాల గంగాధర్)
జగిత్యాల జనవరి 28 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణానికి చెందిన 202 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి,షాది ముభారక్ పథకం ద్వారా మంజూరైన 2 కోట్ల 2 లక్షల రూపాయల విలువగల చెక్కులను, 59 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 19 లక్షల రూపాయల విలువగల చెక్కులను పొన్నాల గార్డెన్స్ లో లబ్ధిదారులకు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అందజేసారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, 6216 కొత్త రేషన్ కార్డులు జగిత్యాల పట్టణంలో మంజూరు అయ్యాయి.జగిత్యాలకు రాష్ట్రం లోనే అత్యధిక ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయటం కోసం,జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.
జగిత్యాల పట్టణంలో ప్రతి వార్డు లో 2 కోట్ల వరకు అభివృద్ధి పనులు కు నిధులు ఖర్చు చేయడం జరిగింది పనులు జరుగుతున్నాయి.
మెడికల్ కళాశాల లో గతంలో 10 కోట్ల మాత్రమే మంజూరు కాగా పనులు నిలిచిపోయాయని, ముఖ్యమంత్రి,వైద్య ఆరోగ్య మంత్రి నీ కోరి నిధులు మంజూరుకు కృషి చేసి,మెడికల్ కాలేజి పూర్తికి కృషి చేస్తా అన్నారు.
నూకపల్లి అర్బన్ కాలనీ మున్సిపల్ లో కలపబోతున్నం..అంబారీ పెట్ లో 2 కోట్ల తో అర్బన్ పార్క్ ఏర్పాటు తో పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణ ఏర్పడుతుంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉండి, బీజేపీ ఎంపీ అరవింద్ తో అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తా..పట్టణం సమగ్ర అభివృద్ధి నా లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రామ్మోహన్,తాజామాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతి లక్ష్మణ్,గిరి నాగభూషణం,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్,బాలే శంకర్,మాజీ కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,పట్టణ,వార్డు నాయకులు,మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.