పోలీసు అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయo తో పనిచేయాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయoతో పనిచేయాలి
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 29 (ప్రజా మంటలు):
నిందితులకు శిక్షపడుటలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కీలకపాత్రని , పోలీసు అధికారులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సమన్వయo తో నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా కృషి చేయాలని సూచించారు. వివిధ ఘటనల్లో నిందితులపై నమోదైన కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు మొదలు, కేసు విచారణ లో సదరు పోలీస్ అధికారులకు సూచన చేయడం, పోలీసు అధికారులు సాక్షులను సరైన పద్దతిలో ప్రొడ్యూస్ చేయు పద్ధతి, మొదలైన అనేక అంశాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రధాన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదుపడేలా కృషి చేసి శిక్షల శాతం పెరిగేలా పని చేయటం అభినదనియని అన్నారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నూతన చట్టాలను అమలులో పోలీసు అధికారులకు ఏర్పడే సందేహాలను నివృత్తి చేశారు.
గడిచిన సంవత్సర కాలంలో 64 కి కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి జైలు శిక్షలు కోర్ట్ ద్వారా విదించడం కృషి చేసిన పీపీలు అభినందించి శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
ఈ సమావేశంలో డిఎస్పీలు రఘు చందర్ రాములు, రంగారెడ్డి మరియు సి.ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు