చిలకలగూడ లో యువతి అదృశ్యం
చిలకలగూడ లో యువతి అదృశ్యం
సికింద్రాబాద్, అక్టోబర్ 23 (ప్రజామంటలు) :
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ టీనేజీ యువతి అదృశ్యమైంది. మహిళా సబ్ ఇన్స్పెక్టర్ సబిత తెలిపిన వివరాల ప్రకారం...చిలకలగూడ కింది బస్తీలో చిదురుప ప్రమీల కుటుంబం నివాసం ఉంటుంది. ఆమె కూతురు చిదురుప మహాలక్ష్మీ (23) ప్రైవేట్ జాబ్ చేస్తుంది. మహాలక్ష్మీ విజయ్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే విజయ్ మరో వివాహం చేసుకొని, ఓ కొడుకును కూడ కన్నాడు. అయినప్పటికీ విజయ్ పై ప్రేమ తగ్గని మహాలక్ష్మీ తాను విజయ్ నే పెళ్ళి చేసుకుంటానని ఇటీవల కుటుంబసభ్యులతో గొడవ పడుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంట్లో వారికి చెప్పకుండా మహాలక్ష్మీ ఎటో వెళ్ళిపోయింది. తమకు తెలిసిన చోటల్లా వెతికిన ఫ్యామిలీ మెంబర్స్ కు నిరాశే మిగిలింది. విజయ్ పైనే అనుమానం వ్యక్తం చేస్తూ, యువతి తల్లి ప్రమీల చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫొటోలోని యువతి ఆచూకీ తెలిసిన వారు పీఎస్ లో తెలపాలని ఎస్.ఐ సబిత కోరారు.
–––